Ads
మరికొద్ది సేపట్లో న్యూజిలాండ్ ,పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న పోరుకు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు భారత్ లో అడుగు పెట్టింది.
అందుకే పాకిస్తాన్ జట్టుకి హైదరాబాద్ ఫ్యాన్స్ ఘన స్వాగతం కూడా పలికారు. ఈ నేపథ్యంలో జరగనున్న మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఆటగాళ్లు బాగానే కసరత్తు కూడా చేస్తున్నారు.
ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రాక్టీస్ సెషన్ లో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు ఒక హైదరాబాది ఫాస్ట్ బౌలర్. వెంటనే పాకిస్తాన్ జట్టు అతన్ని తమ నెట్ బౌలర్ గా తీసుకోవడంతో.. ఈ వార్త బాగా వైరల్ అయింది. ఇంతకీ ఆ బౌలర్ ఎవరు? అసలు ఏం జరిగింది ?అనే విషయాలు తెలుసుకుందాం పదండి. హైదరాబాద్ అండర్ 19 లోని ఫాస్ట్ బౌలర్ నిశాంత్ సరను.. ఐదు అడుగుల పైన హైట్ ఉండే ఈ బౌలర్ వేసే షార్ట్ బాల్స్, బౌన్సర్లు ఎదుర్కోవడం కాస్త కష్టమే.
Ads
సుమారు గంటకు 140 నుంచి 150 వేగంతో బంతులను విసరడం నిశాంత్ స్పెషాలిటీ. కివిస్తో జరిగే వర్మ మ్యాచ్ కి ముందుగా పాకిస్తాన్ బాటర్స్ నిశాంత్ వేసిన బంతులను ఎదుర్కొన్నారు.. ఈ నేపథ్యంలో అతని బౌలింగ్ కి ఫిదా అయిన వీళ్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఇంటర్నేషనల్ బ్యాటర్స్ కు బౌలింగ్ చేయడం నిశాంత్ కు ఇది తొలిసారి కాదు…
ఇంతకుముందు భారత్ ,న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ సమయంలో కూడా నెట్ బౌలర్గా అతను తన బాధ్యతలు నెరవేర్చాడు. అయితే ప్రస్తుతం నిశాంత్ స్కిల్స్ కి క్లీన్ బౌల్డ్ అయిన పాకిస్తాన్ టీం… హైదరాబాదులో ఉండే రెండు వారాల సమయం అతన్ని విడిచే ఉద్దేశం లేదు అన్నట్లు చెప్పకనే చెబుతోంది. త్వరలో హైదరాబాద్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు నిశాంత్ సరను.
watch video :