Ads
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా వారి ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫీవర్ కొనసాగుతోంది. ముఖ్యంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా పర్ఫామెన్స్ ఫ్యాన్స్ ను ఫుల్ కుష్ చేస్తుంది. ఈసారి ప్రపంచ కప్ లో ఎలాగైనా టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీం ఇండియా తన ప్రణాళికలను పక్కాగా వేసుకుంటూ ఆ దిశగా పయనిస్తోంది. మొదటి మ్యాచ్ లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత తమ పర్ఫామెన్స్ తో విమర్శకులచేతే ప్రశంసలు అందుకుంటున్నారు టీం ఇండియన్ ప్లేయర్స్.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంది టీం ఇండియా. అయితే ఇటీవల నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన లో అనుకోకుండా ఒక వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అనూహ్యంగా ప్రేక్షకులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ స్టేడియంని హోరెత్తించారు. దీంతో తమ ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యే విధంగా కేకలు విజిల్స్ వేశారు అంటూ పాక్ కోచ్ ఆరోపించాడు.
Ads
ఈ విషయంపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వినూత్నంగా స్పందించాడు. భారత్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడికి గురవడమే కాకుండా.. నిందలు పక్కన వాళ్ళ మీద వేయడానికి సాకులు వెతుకుతోంది. ఈ నేపథ్యంలో జై శ్రీరామ్ నినాదాలు చేశారని పాక్ కోచ్ ఆరోపించడమే కాకుండా ఐసీసీకి బీసీసీఐ పై ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కు వర్తించదని ఐసీసీ తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై టీమ్ ఇండియన్ మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ పాక్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
The match Irfan Pathan was referring to was an ODI vs Pakistan in Peshawar,2006.
Irfan had scored 65 including 5 fours to Umar Gul in 1 over
In the 2nd ODI: Ajit Agarkar was targeted in Rawalpindi.
In the 3rd test: crowd had hit a stone to Sachin Tendulkar himself.
India… pic.twitter.com/5GHw1Dvjyp
— Johns (@JohnyBravo183) October 19, 2023
మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు తనపై రాళ్లు ,ఐరన్ బోల్టులు విసిరానని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఆ దాడిలో చాలావరకు రాళ్లు తన కళ్ళ మధ్య తగిలాయని ..కాస్త అటు ఇటు అయితే కంటి చూపు పోయేదని ఈ సందర్భంగా ఇర్ఫాన్ చెప్పాడు. మీరు రాళ్లు విసిరితే తప్పులేదు కానీ మేము జైశ్రీరామ్ అంటే తప్పు వచ్చిందా అని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. పాక్ ఓడిపోయాం అన్న గిల్ట్ నుంచి తప్పించుకోవడం కోసం ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది అని ఆరోపించారు.
Irfan Pathan said, "we were playing a game in Peshawar, a fan suddenly threw an iron nail at me which struck under my eye. We never made an issue out of that and always appreciated their hospitality. Pakistan should stop making issues on crowd behaviour in India". (Star Sports). pic.twitter.com/4NYJELMHyn
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023