సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన ఈ సినిమా చూసారా.? రెండో రోజునుండి స్క్రీన్స్ పెంచారు.!

Ads

యువరాజ్‌ దయాళ్‌ డైరక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసిన చిత్రం ఇరుగప్పట్రు. హీరో విక్రమ్‌ ప్రభు, విదార్థ్‌, శ్రద్ధ శ్రీనాథ్‌, అపర్ణతి, సానియా అయ్యప్పన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పొటన్షియల్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించబడింది. అక్టోబర్ 6న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సక్సెస్ ను పురస్కరించుకొని శనివారం మీడియా తో ముచ్చటించిన నిర్మాత ప్రభు మూవీ గురించి ఒక మంచి మాట అనడం జరిగింది.

ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర అతనికి టైలర్‌మేడ్‌ పాత్ర అనిపిస్తుంది. పైగా ఈ చిత్రం కోసం అతడు బరువు కూడా పెరిగాడట. మరోపక్క ఈ మూవీలో ఎటువంటి పారితోషకం లేకుండా విధార్ధ్‌ నటించడం జరిగింది. మూవీకి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన విక్రమ్ ప్రభువు…చిత్రం రిలీజ్ అవుతున్న అక్టోబర్ 6 వ తారీకు తన తాతగారైన శివాజీ గణేషన్ పుట్టినరోజు అని.. అలాగే అతని భార్య పుట్టిన రోజు కూడా అని…అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ తనకి ఎప్పుడు స్పెషల్ అని పేర్కొనడం జరిగింది.

Ads

ఈ మూవీ ప్రస్తుత జనరేషన్ యువకులు.. కుటుంబ జీవితాలు…వారు ఎదుర్కొనేటటువంటి సమస్యలు.. పరిష్కరించుకునే విధానాలు వర్ణిస్తూ ఎంతో చక్కగా తెరపై ఆవిష్కరించడం జరిగిందని నిర్మాత తెలిపారు. ప్రస్తుతం మూవీకి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని రెండవ రోజు నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తున్న ఆటల సంఖ్య పెంచడం జరిగిందని చెప్పారు. అలాగే మంచి కథ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనడానికి తమ మూవీ సక్సెస్ రుజువని పేర్కొన్నారు.

Previous articleబావ కోసం వచ్చిన మోక్షజ్ఞ తేజ..! అసలు విషయం ఏంటంటే..?
Next articleKALASHA REVIEW : భానుశ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.