Ads
ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జబర్దస్త్ షో ద్వారా చాలామంది తమ టాలెంట్ ను ప్రదర్శించి ప్రస్తుతం స్టార్ కమెడియన్స్ గా ఇండస్ట్రీలో ఛాన్స్ లు దక్కించుకుంటున్నారు.
Ads
అలా వచ్చిన వారిలో ఫేమస్ కమెడియన్ నరేష్ కూడా ఒకరు. పొట్టినరేష్ వేసే పంచులు, కామెడీ టైమింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ పొందాడు. తనలోని లోపంతోనే కామెడీ చేస్తూ అందరిని నవ్విస్తూ, తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల కాలంలో జబర్దస్త్ షోలోని భాస్కర్ టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కమెడియన్ నరేష్ తన పర్సనల్ లైఫ్ గురించిన కొన్ని విషయాలను వెల్లడించారు. అవి ఏమిటో చూద్దాం..
నరేష్ వరంగల్ జిల్లాలోని అనంతపురం అనే గ్రామంలో పుట్టి పెరిగాడు. ఆయనకి చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఆ లోపమే ఇప్పుడు ఆయనకు ఒక వరంగా మారిందని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు 22 ఏళ్ళు. అంత వయసు ఉన్నా పదేళ్ల అబ్బాయిలా కనిపిస్తాడు. నరేష్ 2000లో జన్మించాడు. ఆయనకి డాన్స్ అంటే చాలా ఆసక్తి, దానివల్లే ఆయన ఈటీవీ ఢీ షోకు ఎంపిక అయ్యారు.
అక్కడి నుండే నరేష్ నట ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దగ్గర ఉన్న నరేష్ ను ఒకరోజు సునామి సుధాకర్ చూసి మాట్లాడారంట. ఆ తరువాత జబర్దస్త్ చలాకి చంటి టీమ్ లో చేరారు. అటు తరువాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి జంప్ అయ్యాడు. అప్పటి నుండి నరేష్ జీవితం మారిపోయిందనే చెప్పాలి. జబర్దస్త్ లో తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా మారారు.
ఇక నరేష్ జబర్దస్త్ లోకి వచ్చిన తరువాత తన స్వంత ఊర్లో ఇల్లు కట్టుకున్నారు. అంతే కాకుండా సిటీలో కూడా ఒక ఫ్లాట్ కొన్నారంట. ప్రస్తుతం అంతా బాగున్నా, ఒక్క విషయంలో మాత్రం నరేష్ కు చాలా ఇబ్బంది పడుతున్నానని తెలిపాడు. అది ఆయనకున్న ఎదుగుదల లోపం. అయితే ఈ సమస్య నయం అయ్యేది కాదని, ప్రయత్నించిన ఎంతో ఖర్చుతో కూడుకున్నదని డాక్టర్స్ చెప్పారని నరేష్ తెలియజేసాడు. ఇన్నాళ్లు జబర్దస్త్ షోతో అందరిని నవ్వించిన నరేష్ లైఫ్ లో ఇంత బాధ ఉందని తెలిసి, ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
Also Read: “గోదావరి” సినిమా ముద్దుగుమ్మ “కమిలినీ ముఖర్జీ” గుర్తుందా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?