Ads
తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన కామెడీ షో అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు ‘జబర్దస్త్’. ప్రతివారం ప్రతిభావంతులైన కమెడియన్స్‌తో నవ్వులను పంచుతూ ‘జబర్దస్త్’ ప్రేక్షకులను ఆకట్టకుంటూ వస్తోంది. 2013లో ప్రారంభమైన ఈ షో నిర్విరామంగా ఇప్పటి వరకు 600 ఎపిసోడ్స్‌కిపైగా ప్రేక్షకులను అలరిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. ఇన్నేళ్లు అయినప్పటికీ ‘జబర్దస్త్’ తాజా కంటెంట్‌తో క్రియేటివ్‌గా మెప్పిస్తూ ఇంకా నెంబర్ వన్ కామెడీ షోగా నవ్వుల పువ్వులను పూయిస్తోంది.
Ads
‘జబర్దస్త్’లో పాల్గొన్న కమెడియన్స్ హీరోలుగా, సక్సెస్‌ఫుల్ దర్శకులుగానూ ఇప్పుడు రాణిస్తుండటం విశేషం. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, షకలక శంకర్ వంటివారు సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్, గాలోడు, రాజు యాదవ్, ధర్మస్థలి వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌తో వేణు ఎల్దండి వంటి వారు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.
ధనధన్ ధనరాజ్‌వంటివారు రామం రాఘవం చిత్రంతో దర్శకుడిగా మారిన సంగతి విదితమే. ఇలా బజర్దస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తన మార్క్‌ను క్రియేట్ చేసి ప్రభావాన్ని చూపుతోంది.