Ads
అమెరికాలో రోడ్డు యాక్సిడెంట్ లో తెలుగు యువతి మరణించడం పై అమెరికా పోలీసు ఆఫీసర్ చులకనగా మాట్లాడిన విషయం భారత్ లో కలకలం రేపుతోంది. TV9 తెలుగు కథనం ప్రకారం, యువతి చనిపోయిన తరువాత ఆ పోలీసు ఆఫీసర్ నవ్వుతూ, ఆమెను చులకన చేస్తూ, జోకులు వేసినవి వారి బాడీ కెమెరాలో రికార్డు అవ్వడం, ఆ వీడియో క్లిప్ లు వైరల్ కావడంతో యూఎస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
ఈ ఘటన పై దేశవ్యాప్తంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆ తెలుగు యువతి ఎవరు? ఎలా చనిపోయింది? ఇంతకు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాల గురించి నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని లక్షలు ఖర్చు పెట్టి మరి విదేశాల్లో విద్యని అభ్యంచడానికి వెళ్తుంటారు. తల్లిదండ్రులని వదిలి, పండుగలు, సంతోషాలను అన్నింటిని దూరం పెట్టి మరి చదువుకోవాలని ఎంత కష్టమైన విదేశాల్లో చదువుతారు. ఇలా విదేశాలకు వెళ్లి చదువుకున్న అమ్మాయిల్లో చాలామంది ఉన్నారు. అందులో ఇరవై మూడేళ్ళ జాహ్నవి కందుల ఒకరు.
అమెరికాలో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఈమె తల్లి ఓ ఉపాధ్యాయురాలు. కుటుంబానికి అప్పులు ఎక్కువ కావడంతో జాహ్నవి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసి ఇంటి అప్పులను తీర్చాలనుకుంది. కానీ అంతలోనే యాక్సిడెంట్ జరిగింది. కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన జాహ్నవి నందిగామలో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ లో ఇంజినీరింగ్ చదివింది. ఆ తర్వాత ఆమెకు అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ లో సీటు రావడంతో 2021లో మాస్టర్స్ లో చేరింది.
ఇటీవల అమెరికాలో రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయిన కందుల జాహ్నవి మరణం దేశవ్యాప్తంగా కలచివేస్తుంది. ఈమె రోడ్డు దాటుతుంటే ఓ పోలీస్ వాహనం అతివేగంగా వచ్చి జాహ్నవిని ఢీకొట్టడింది. అక్కడక్కడే జాహ్నవి చనిపోయింది. ఈ కేసును పోలీస్ ఆఫీసర్ డానియెల్ అడరర్ దర్యాప్తు చేసి మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆ పోలీస్ ఆఫీసర్ గట్టిగా నవ్వుతూ 11వేల డాలర్ల చెక్ ఇస్తే సరిపోతుందని చులకన చేసి మాట్లాడిన మాటలు బయటకి వచ్చాయి. అమెరికా పోలీసులపై యావత్ భారతదేశమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాహ్నవి చనిపోయిన ప్రదేశంలో గంటకు స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. కానీ ఆ వాహనం గంటకు 119 కిలోమీటర్లు స్పీడ్‌లో వెళ్లడం వల్లే జాహ్నవి చనిపోయిందని తెలుస్తుంది.