ఉద్యోగం వచ్చాక బయటపడ్డ మోసం..! ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు..?

Ads

అందరికీ ప్రభుత్వ ఉద్యోగం అంటే మక్కువ.ఆ మక్కువతో ఉద్యోగం సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలా ఉద్యోగం సాధించడం తన వల్ల కాదు అని అనుకున్న ఒక వ్యక్తి తన బదులుగా వేరే అతని పరీక్షకి పంపి ఉద్యోగం సాధించి చివరికి అధికారుల చేతికి దొరికిపోయాడు.

ఈ ఘటన హైదరాబాద్ లోని అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. అల్వాల్ ఎస్‌ఐ సురే్‌షకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాకి చెందిన బాల్‌రాజ్‌ (23) అనే యువకుడు గతేడాది నవంబరులో అటవీ శాఖ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షను రాయాలనుకున్నాడు.

government job

తనకున్న తెలివితేటలకు ఉద్యోగం రావడం కష్టమని భావించిన అతడు… తన స్నేహితుడు అజయ్ తో పరీక్ష రాయించాలని అనుకున్నాడు. దీంతో ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు తన ఫోటోకు బదులు అతడి ఫోటోను అప్‌లోడ్ చేశాడు. హాల్ టిక్కెట్‌లో ఆ ఫోటో వస్తే.. పరీక్ష రాయడానికి ఎటువంటి సమస్య ఉండదని ముందుగానే ప్లాన్ చేశారు. చివరకు వారు అనుకున్నట్టుగానే హాల్ టిక్కెట్ రావడం,అల్వాల్‌ లయోలా అకాడమీలో పోటీ పరీక్ష రాయడం జరిగింది. ఫలితాలు వచ్చాక బాల్‌రాజ్‌ ఉద్యోగానికి అర్హత సాధించాడు.

Ads

ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అతడికి అపాయింట్‌మెంట్‌ లెటర్‌ పంపారు. కానీ ఇక్కడే అతడి బండారం బయటపడింది. ఉద్యోగంలో చేరడానికి వచ్చిన వ్యక్తి,పరీక్ష రాసిన వ్యక్తి ఫొటో వేర్వేరుగా ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు అతడిని నిలదీయడంతో అసలు విషయం వెల్లడించారు. తన స్థానంలో పరీక్ష రాసింది వేరే వ్యక్తి అని చెప్పాడు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతడ్ని శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పరీక్ష రాసిన వ్యక్తి అజయ్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు

Previous article7 ఏళ్ల క్రితం సినిమా… ఇప్పుడు రిలీజ్ అవుతోంది..! ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనా..?
Next articleశ్రీలీల లాగే తమ డ్యాన్స్ తో భారతీయ సినీ పరిశ్రమను ఊపేసిన 10 మంది హీరోయిన్లు వీరే..
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.