లోకేష్-బ్రాహ్మణి పెళ్లి ఫొటోలో ఉన్న ఈ యంగ్ హీరో భార్యను గుర్తుపట్టారా.? అప్పుడు ఆమె ఎంత చిన్నగా ఉన్నారో చూడండి.!

Ads

నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి తనయుడు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు గారు రిమాండ్‌లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే…సోషల్ మీడియాలో ఈ కుటుంబంకి సంబందించిన అరుదైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణిని లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేసిన సంగతి అందరికి తెలిసిందే. వాళ్ళ పెళ్లి నాటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా ఉన్నారు. ఆ ఫోటో ఒక లుక్ వేయండి. 2007 లో లోకేష్ బ్రాహ్మణిల పెళ్లి జరిగింది. అప్పుడు లక్ష్మి ప్రణతి ఎంత చిన్నగా ఉన్నారో చూడండి. అప్పటికి తన వయసు 15 సంవత్సరాలు. 2011 లో ఎన్టీఆర్ కు లక్ష్మి ప్రణతితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు జన్మించిన సంగతి తెలిసిందే. వారి పేర్లు అభయ్ రామ్, భార్గవ్ రామ్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తారక్ తన ఫామిలీ తో కూడా టైం స్పెండ్ చేస్తూనే ఉంటాడు.

Ads

గతంలో నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. లోకేష్ మాట్లాడుతూ “తనది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని అన్నారు. అయితే ‘ముద్దుల మామయ్య (నందమూరి బాలకృష్ణ) దగ్గర అంత సాహసం చేసేవాడ్ని కాదని వెల్లడించారు. ఇంట్లో అమ్మానాన్నవాళ్ళు ఒక వెకేషన్ కు వెళ్తే అక్కడ చెప్పారు. ఇలా మేము అనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏంటని అడిగారు.

నా అభిప్రాయం మీకు తెలుసు కదా. వాళ్ళు ముందు అలా ప్రతిపాదించారు. బ్రాహ్మణి కూడా ఒప్పుకుంది. వివాహం జరగడం, ఆ తరువాత జరిగింది మీకు తెలిసిందే కదా” అంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ ఈ విషయాలు చెప్తున్నంతసేపు ఆ ప్రాంగణమంతా అక్కడున్న విద్యార్థులు, మరియు యువత అరుపులతో మార్మోగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

watch video:

Previous articleతెలివైన వారు..స్త్రీలు మీ మాట వినేలాగా చేయాలంటే… చాణుక్యుడు చెప్పిన ఈ 4 హిప్నోటిజం ట్రిక్స్ ట్రై చేయండి!!
Next articleఅతని బట్టలు చూసి తక్కువ అంచనా వేసి అవమానించారు…చివరికి ఏమైందో తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.