Ads
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక స్కూల్ లో విద్యార్థినిలు జడ వేసుకోకుండా వచ్చారన్న కోపంతో ఒక టీచర్ ఎనిమిది మంది విద్యార్థినిల జుట్టును కత్తిరించారు.
ఈ విషయం తెలిసిన విద్యార్థినుల పేరెంట్స్, జుట్టు కత్తిరించిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, స్కూల్లో ఆందోళనకు దిగారు. ఈ ఘటన కాకినాడలో కలకలం రేపింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
కాకినాడ జిల్లాలిని సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక హై స్కూల్ లో నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థినులు రెండు జడలు వేసుకోకుండా క్లిప్పులు మాత్రమే పెట్టుకుని వెళ్తున్నారు. దాంతో స్కూల్ టీచర్ మంగాదేవి గత కొద్ది రోజులుగా కేశాలంకరణ పై ఆ విద్యార్థులను హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే టీచర్ హెచ్చరికను పట్టించుకోకుండా బుధవారం నాడు కొందరు విద్యార్థినులు జుట్టుకి క్లిప్పులు పెట్టుకుని తరగతులకు వచ్చారు.
ఎన్నిసార్లు చెప్పినా కూడా విద్యార్థినులు జడ వేసుకోకుండా మళ్ళీ క్లిప్పులు మాత్రమే పెట్టుకుని స్కూల్ కు వచ్చేసరికి ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు, 8 మంది విద్యార్థినులు జుట్టును చివర్లో కొంచెం కత్తిరించారు. ఆ విద్యార్థినులు ఇంటికి వెళ్ళి టీచర్ జుట్టు కత్తిరించిన విషయాన్ని తెలియచేసారు. దాంతో వారి తల్లిదండ్రులందరు టీచర్ కత్తిరించిన జుట్టును పట్టుకుని స్కూల్ కి వెళ్ళి, ఆ టీచర్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.
విద్యార్థినుల తల్లిదండ్రులందరు స్కూల్ లో ఆందోళన చేయడంతో అక్కడి అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పేరెంట్స్ కు సర్దిచెప్పడంతో శాంతించారు.ఈ ఘటన పై డీఈవోకు నివేదిక అందజేసినట్లు అర్బన్ ఎంఈవో చెవ్వూరి రవి, డీవైఈవో రాజు వెల్లడించారు. బాధితుల వాంగ్మూలాన్ని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. మరోవైపు టీచర్ పై చర్యలు తీసుకోవాలని భారత విధ్యార్ధి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) కూడా డిమాండ్ చేసింది. ఈ ఘటన పై స్పందించిన డిస్ట్రిక్ విద్యాశాఖ ఆఫీసర్లు టీచర్ మంగాదేవిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులను జారీ చేశారు.
Ads
watch video:
Also Read: అసలు కెనడాలో ఏం జరుగుతుంది.? ఎందుకు ఇండియన్స్ ని జాగ్రత్తగా ఉండమంటున్నారు..?