నెట్టింట వైరల్ అవుతున్న కళ్యాణ్ రామ్ భార్య పిల్లల ఫొటోస్.. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్.!

Ads

తెలుగు ప్రేక్షకులకు నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కళ్యాణ్ రామ్ సుపరిచితమే. నందమూరి తారకరామారావు మనవడిగా, నందమూరి హరికృష్ణ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ ఇటీవలే డెవిల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు కళ్యాణ్ రామ్.

Ads

ఒకవైపు హీరోగా నటిస్తూ మెప్పిస్తూనే మరొకవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే హీరో కళ్యాణ్ రామ్ ఎలా ఉంటారు అన్నది మనం తెరపై చూసే ఉంటాం. తన పర్సనల్ లైఫ్ గురించి మీడియాకి దూరంగా ఉంచుతారు కళ్యాణ్ రామ్. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు నందమూరి అభిమానులు కూడా చాలా వరకు ఆయన భార్య పిల్లలను చూడలేదు. అయితే ఇటీవలే సోషల్ మీడియా కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో కళ్యాణ్ రామ్ తన భార్య స్వాతి,కొడుకు సౌర్య రామ్, కూతురు తారక అద్విత లతో కలిసి దిగారు. చూడడానికి చాల క్యూట్ గా ఉన్న కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

చాలామంది ఆ ఫోటో చూసి క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్ చేయడంతో పాటు కళ్యాణ్ రామ్ కు అంత పెద్ద పాప బాబు ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే కళ్యాణ్ రామ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం డెవిల్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Previous articleకనుమ రోజు ఎందుకు ప్రయాణం చెయ్యరో తెలుసా..? శాస్త్రం ఏం చెప్తుంది?
Next articleమెగా ఫ్యామిలీ అంతా ఒకలా ఉంటే… పవన్ కళ్యాణ్ మాత్రం ఇలా..! అందుకే జనసేనాని అంటారు ఏమో..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.