వేదం మూవీలో ‘కర్పూరం’ క్యారెక్టర్ చేసింది ఎవ‌రో తెలుసా?

Ads

ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు వసూళ్లు బాగా రాబట్టి సూపర్ హిట్స్ గా నిలుస్తాయి. అయితే కొన్ని చిత్రాలు క‌లెక్ష‌న్లు ఎక్కువగా వసూల్ చేయలేకపోయినా ఆడియెన్స్ మనసులలో స్థానాన్ని పొందుతాయి. అలా ప్రేక్షకుల హృదయంలో స్థానం పొందిన సినిమాలల్లో ‘వేదం’ కూడా ఉంటుంది.

Ads

ఈ చిత్రానికి క్రిష్ డైరెక్షన్ చేశాడు. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్, మ‌నోజ్ లు హీరోలుగా న‌టించారు. హీరోయిన్ గా దీక్షాసేత్ న‌టించింది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ మ‌నోజ్ బాజ్ పాయి కీలకమైన పాత్ర‌లో న‌టించారు.
ఈ సినిమా అన్ని క‌మ‌ర్షియల్ సినిమాల కాకుండా భిన్నంగా ఉంటుంది. కొంద‌రి లైఫ్ లో జ‌రిగే సంఘటనల ఈ చిత్రం చూపిస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ అనుష్క శెట్టి కూడా కీలకమైన పాత్ర‌లో న‌టించిన విషయం అందరికి తెలిసిందే. అయితే స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో అనుష్క ఈ సినిమాలో అలాంటి పాత్ర‌ చేయడం అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేసింది.
కాగా ఆ పాత్రలో అనుష్క న‌ట‌న‌కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రంలో గుర్తిండిపోయే మరో క్యారెక్టర్ క‌ర్పూరం అనే హిజ్రా. అయితే ఈ క్యారెక్టర్ సినిమాలో అనుష్క ప‌క్క‌నే ఉంటుంది. ఈ క‌ర్పూరం క్యారెక్టర్ ఆడియెన్స్ ను చాలా ఆకట్టుకుంది. బ్ర‌హ్మానందంతో ఈ సినిమాలో క‌ర్పూరంతో చేసే కామెడీ ఆడియెన్స్ ని బాగా న‌వ్వించింది. అది మాత్రమే కాకుండా ఎమోష‌నల్ సన్నివేశంలో బాగా నటించింది.
మూవీలో కాల్పుల్లో క‌ర్పూరం గాయ‌ప‌డినప్పుడు ఉన్న ఎమోష‌నల్ సీన్ ఆడియెన్స్ ని ఏడిపించింది. అయితే ఆ క్యారెక్టర్ లో న‌టించింది ఎవ‌రు అనే విషయం ఎక్కువ మందికి తెలియదు. ముందు క‌ర్పూరం క్యారెక్టర్ ను డైరెక్టర్ క్రిష్ చేయాలని భావించారట. క్రిష్ త‌ల్లి వ‌ద్ద‌ని చెప్పడంతో ఎవరితో చేయించాలని ఆలోచిస్తుండగా, అనుష్క త‌న మేకప్ మెన్ ఫోటోల‌ను ఆయనకు చూపించార‌ట‌. అంతేకాకుండా క‌జ్ రారే సాంగ్ కు మేకప్ మెన్ నిక్కి చేసిన డ్యాన్స్ వీడియోను కూడా చూపిండంతో, అది చూసి క్రిష్ క‌ర్పూరం పాత్ర‌కు నిక్కిని ఓకే చేశారంట.

Also Read: హనీ రోజ్ వీరసింహరెడ్డి సినిమా కన్నా ముందు హీరోయిన్ గా ఏ తెలుగు సినిమాలో నటించిందో తెలుసా ?

Previous articleహనీ రోజ్ వీరసింహరెడ్డి సినిమా కన్నా ముందు హీరోయిన్ గా ఏ తెలుగు సినిమాలో నటించిందో తెలుసా ?
Next articleరూ.2000, 500, 100 నోట్ల మీద నల్లటి గీతలు ఉంటాయి..? డిజైన్ అయితే కాదు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.