Ads
- చిత్రం : జపాన్
- నటీనటులు : కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్.
- నిర్మాత : ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
- దర్శకత్వం : రాజుమురుగన్
- సంగీతం : జివి ప్రకాష్ కుమార్
- విడుదల తేదీ : నవంబర్ 10, 2023
స్టోరీ :
ఈ సినిమాలో హీరో కార్తీ పేరు జపాన్. చిన్నప్పటి నుంచి పొట్టకూటి కోసం ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పెరిగి పెద్దవుతాడు. ఆ తర్వాత పూర్తిస్థాయి దొంగగా మారి పెద్ద పెద్ద దొంగతనాలకు అలవాటు పడతాడు. అప్పుడే జపాన్ కు ఒక భారీ డీల్ కుదురుతుంది. అది ఓకే అయితే మనోడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అవుతాడు. ఒక మంత్రి ఇంట్లో ఉన్న డబ్బులు కొట్టేసే డీల్ అది. ఆ డీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జపాన్ ఆ మంత్రి ఇంట్లో డబ్బులు కొట్టేస్తాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
మంత్రి ఇంట్లో అదే సమయంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ చేసింది, దొంగతనం చేసింది రెండూ జపానే అని అనుకొని పోలీసులు జపాన్ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే అసలు ఈ మర్డర్ ఎవరు చేశారు? జపాన్ మీద ఎందుకు నెట్టారు? అక్కడ దొంగతనం చేసిన తర్వాత జపాన్ ఎక్కడికి వెళ్లాడు. అనేదే అసలు కథ.
Ads
రివ్యూ :
కార్తి గురించి ఆయన నటన గురించి మనందరికీ తెలిసిందే. ఇందులో కూడా కార్తీ నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. సస్పెన్స్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ బాగా పండాయి. ఈ సినిమాలో ప్రతి దొంగతనం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కానీ, ఆ సస్పెన్స్ కానీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక మ్యూజిక్ ఈ సినిమాకు సూపర్ ప్లస్ అని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా బాగానే నటించింది. తన గ్లామర్ డోస్ ను పెంచింది. ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటించిన సునీల్ కూడా ఇరగదీశాడు. సరికొత్త సునీల్ ను మనం ఈ సినిమాలో చూస్తాం.
ప్లస్ పాయింట్స్ :
- కార్తీ నటన, వేరియయేషన్స్
- మ్యూజిక్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్
- స్క్రీన్ ప్లే
- యాక్షన్
- సస్పెన్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- సాంగ్స్
- ల్యాగ్ సీన్స్
రేటింగ్ :
2.5/5