KARTHIKA POURNAMI 2023: కార్తీకపౌర్ణమి శుభ సమయం ఎప్పుడు.? పూజా విధానం… దీపాల ప్రాముఖ్యత ఇదే?

Ads

ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఎక్కడ చూసినా కూడా శివాలయాలు దీపాల వెలుగులతో వెలిగి పోతున్నాయి. అయితే ఈ కార్తీకమాసంలో ఇంట్లో కూడా నిత్య దీపారాధన చేసుకోవడంతో పాటు ప్రధానముఖ ద్వారం వద్ద తులసి కోట వద్ద కూడా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇకపోతే కార్తీక పౌర్ణమి ఎప్పుడూ అన్న సందేహం చాలా మందిలో ఉంది.

మరి కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. ఈ సంవత్సరం అనగా 2023 కార్తీక పూర్ణిమ 27 నవంబర్ 2023 సోమవారం రోజు వచ్చింది. కార్తీక పూర్ణిమ రోజున ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది. దాన ధర్మాలు చేయడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయయి.

అలాగే అన్నింటా కూడా అదృష్టం కలిసివస్తుంది. నవంబర్ 26, 2023 ఆదివారం మధ్యాహ్నం 03:53 గంటలకు ప్రారంభం నవంబర్ 27, 2023 సోమవారం మధ్యాహ్నం 02:45 గంటలకు ముగింపు. ఉదయ తిథి ప్రకారం, 27 నవంబర్ 2023 సోమవారం నాడు పూర్ణిమ ఉపవాసం, స్నానం ఆచరిస్తారు. ఇకపోతే కార్తీక పూర్ణిమ వ్రత, పూజా విధానం విషయానికి వస్తే…ఈ రోజు నవంబర్​ 27 సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి. అనంతరం లక్ష్మీ దేవి, శ్రీమహా విష్ణువు, శివుడి ముందు నెయ్యితో దీపం వెలిగించి, పూజలు, పండ్లు, పువ్వులు, నైవేద్యాలు, ధూప నైవేద్యంతో హారతి ఇవ్వాలి. రాత్రి చంద్రోదయం తర్వాత పచ్చి పాలను నీటిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి.

Ads

విష్ణువును పూజించిన తర్వాత చలిమిడి, వడపప్పు సహా పంచామృతాన్ని ప్రసాదంగా సమర్పించి ఉపవాసం విరమించాలి. కాగా పురాణాల ప్రకారం, శ్రీ హరి విష్ణువు ఈ మాసంలో మత్స్యావతారం ఎత్తారు. ఈ సంవత్సరం 2023 కార్తీక పూర్ణిమ వ్రతం నవంబర్ 27 న నిర్వహించబడుతుంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల ఈ మాసమంతా పూజించినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపారాధన చేయడం వల్ల ఏడాది మొత్తం పూజ చేసిన ఫలితం దక్కుతుంది.

కార్తీక పూర్ణిమ రోజున గంగా-యమునా నదిలో స్నానం చేయడం ద్వారా శుభం కలుగుతుంది.
చేతిలో కుశాన్ని తీసుకుని పవిత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయాలి. ఇలా చేయడం వల్ల స్వస్థత చేకూరుతుంది. కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు కలిపిన నీటితో స్వస్తిక్ గుర్తు వేయాలి. దీనితో పాటు, మామిడి ఆకుల తోరణం ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

కార్తీక పూర్ణిమ రోజున గంగా ఘాట్ లేదా ఏదైనా పవిత్ర నది ఘాట్ వద్ద దీపం వెలిగించి దీపం వెలిగించడం ద్వారా దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. దీనితో పాటు, ఇంట్లో ఆనందం శ్రేయస్సు వస్తుంది. అదేవిధంగా కార్తీక పూర్ణిమ రోజున తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కార్తీక పూర్ణిమ నాడు శివుడిని కూడా పూజిస్తారు. ఈ రోజునే త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున, శివలింగంపై పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంగాజలం పంచామృతాన్ని సమర్పించడం ద్వారా భోలేనాథ్ సంతోషిస్తాడు.

Previous articleయానిమల్ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టేనా? రేటింగ్ ఎంత అంటే.?
Next articleTS ELECTIONS 2023 :తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ 5 మంది యువ నారీమణులు ఎవరో తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.