స్టార్ హీరోలా కనిపిస్తున్న “కత్రినా కైఫ్” బాడీ గార్డ్ జీతం ఎంతో తెలుసా..?

Ads

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. కొన్నేళ్ళ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితమైన కత్రినా, త్వరలో టైగర్ 3 మూవీతో ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది.

ఇటీవల రిలీజ్ అయిన టైగర్ 3 మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ 50 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ ట్రైలర్ లో కత్రినా కైఫ్ హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే, కత్రినా కైఫ్ బాడీగార్డ్ జీతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కత్రినా కైఫ్ బాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ఆమె కెరీర్ 2003లో బాలీవుడ్ లోనే ప్రారంభించినప్పటికి, ఆమె నటించిన సినిమా ఫ్లాప్ కావడమే కాకుండా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమె బ్రిటిష్ నటి, హిందీ రాకపోవడంతో హిందీ సినిమాలలో ఛాన్సులు అంతగా రాలేదు. 2004 లో తెలుగులో మొదటిసారి మల్లీశ్వరి సినిమాలో నటించారు. ఈ చిత్రానికి ఆమె 75 లక్షల రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకుని, సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా వార్తల్లో నిలిచింది.

ఆ తరువాత ఆమె నటించిన హిందీ చిత్రాలు హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కత్రినా ఒక్కో మూవీకి దాదాపు 12 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుందని సమాచారం. ప్రస్తుతం కత్రీనా  సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ 3 మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కత్రీనా  ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. కత్రీనాతో పాటు ఆమె బాడీగార్డ్ కూడా వచ్చారు.
కత్రీనా సల్వార్ లో అందంగా కనిపించింది. అయితే ఆమె బాడీగార్డ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ వర్గాల్లో అతని శాలరీ  గురించి చర్చ జరుగుతోంది. కత్రీనా కైఫ్ బాడీగార్డ్ పేరు దీపక్ సింగ్. అతడి శాలరీ సంవత్సరానికి కోటి రూపాయలు. ఈ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: 1990 లో ఉన్నట్టు ఇంకా ఆ సీన్లు ఏంటి బాలయ్య…”భగవంత్ కేసరి”లో సీన్ ని అందుకేగా ట్రోల్ చేసేది.!

Previous articleభారత్ తో మీకు పోలికా.? వెళ్లి పిల్ల కూనలపై ఆడుకోండి..!
Next articleరాజేంద్రప్రసాద్, గౌతమి నటించిన ఈ కొత్త సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.