Ads
సినిమాల ద్వారా ఎంతో మంది మనకి వ్యక్తిగతంగా పరిచయం లేని వారు కూడా బాగా దగ్గరగా అనిపిస్తారు. వాళ్లు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ వ్యక్తితో మనకి బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది.
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చనిపోయినప్పుడు కూడా అలాగే జరిగింది. ఆయన మనకి వ్యక్తిగతంగా తెలియకపోయినా కూడా ఆయన పాటల ద్వారా ఎన్నో తరాల నుండి ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఆయన పాట లేనిదే రోజు గడవదు.
అలాంటి వ్యక్తి మన మధ్యలో లేరు అంటే జీర్ణించుకోవడానికి ప్రజలందరికీ చాలా సమయం పట్టింది. ఇప్పటికి కూడా ఆయనను తలుచుకొని బాధపడేవారు చాలా మంది ఉంటారు. అయితే, అందుకే ఆయన జ్ఞాపకాలని ప్రేక్షకులకు ఇంకా దగ్గరగా ఉంచాలి అని చాలా మంది సినిమా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటీవల తరుణ్ భాస్కర్ కూడా అలాగే చేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కీడా కోలా సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి వాయిస్ రీక్రియేట్ చేశారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్, ఎస్ జానకి గారి వాయిస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించి, పట్టనా ఓ పట్టు అనే ఒక పాటను ఈ సినిమా కోసం చేశారు. సినిమా చూసినప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని మళ్లీ తలుచుకోవడం చాలా భావోద్వేగంగా అనిపించింది అని, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయం మీద చర్చ జరుగుతోంది. అందుకు కారణం, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి కొడుకు, ఎస్పీ చరణ్ కీడా కోలా టీం మీద కేసు వేశారు. తన అనుమతి లేకుండా తన తండ్రి గాత్రాన్ని సినిమాలో ఎలా వాడుతారు అని ఎస్పీ చరణ్ కేసు వేశారు.
Ads
ఈ విషయం మీద ఎస్పీ చరణ్ లాయర్ మాట్లాడుతూ, “అనుమతి లేకుండా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గాత్రాన్ని సినిమాలో ఉపయోగించిన కారణంగా క్షమాపణ చెప్పాలి, దాంతో పాటు కోటి రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలి అని చెప్పారు. ఇవి మాత్రమే కాకుండా రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలి” అని అన్నారు. అయితే, దర్శకుడు తరుణ్ భాస్కర్ మాత్రం ఇంకా ఈ విషయం మీద స్పందించలేదు. దీని మీద రెండు రకమైన వాదనలు వినిపిస్తున్నాయి.
కొంత మంది, “ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు అంటే తెలుగు వారు తమ సొంత వారి లాగా అనుకుంటారు కాబట్టి ఆ అనుబంధంతోనే ఇలా చేసి ఉండొచ్చు” అని అంటున్నారు. మరి కొంత మంది అయితే, “ఏదేమైనా సరే. సొంత వారి అనుమతిని తీసుకొని ఉంటే బాగుండేది” అని అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ విషయం మీద కేసు వేశారు. మరి దీనిపై ఎలాంటి చర్చలు జరిగి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
watch video :
ALSO READ : వైయస్ షర్మిల కొడుకు పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఎవరో తెలుసా..? ఒక్క ఫోటో సెషన్ కి ఎంత తీసుకుంటారు అంటే..?