Ads
కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చిన్న హీరోల చిత్రాలైనా సరే విపరీతమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అలా యువనటీనటులు రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ కాంబోలో రూపొందిన తాజా చిత్రం కృష్ణ గాడు అంటే ఒక రేంజ్. మూవీలోని తన రేంజ్ చూపిస్తూ రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 4న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.
Ads
మంచి కథతో ,విభిన్నమైన లవ్ స్టోరీని హైలెట్ చేస్తూ స్వచ్ఛమైన ఎమోషన్స్ తో తీసిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీపీ లో కూడా తన సత్తా చాటుతూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. చాలా న్యాచురల్ గా సాగే ఒక చిన్ని లవ్ స్టోరీ కి ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు అటాచ్ చేసి కాస్త ఎమోషన్ రంగరించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అందుకే ఈ మూవీ చిన్నదైనా సాలిడ్ గా ఎంటర్టైన్ చేస్తుంది.
ఈ మూవీలో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న నటన, కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయ్యాయి. ఈ చిత్రానికి సాబు వర్గీస్ సంగీతాన్ని సమకూర్చారు. మొత్తం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్‌కే రఫీ కెమెరా వర్క్ అద్భుతంగా సెట్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆలస్యం చేయకుండా ఎంచక్కా ఈ మూవీ ని ఎంజాయ్ చేయండి.