Ads
కన్నుల పండుగగా, కోట్లాది రామ భక్తుల కల బాల రాముడి ప్రాణప్రతిష్టతో నెరవేరింది. అయితే 500 ఏళ్ళుగా అయోధ్యలో రామమందిరాన్ని పునర్నిర్మించడం కోసం వందలాది యుద్ధాలు జరిగిన విషయం తెలిసిందే. వేలాదిగా ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ తరువాత రామ మందిర నిర్మాణం కోసం చేసే పోరాటం కోర్టు మెట్లు కూడా ఎక్కింది.
విచారణా తరువాత ఈ సంక్లిష్టమైన సమస్యకు సుప్రీంకోర్టు 2019 లో తీర్పుని వెలువరించింది. రామమందిర నిర్మాణం చేపట్టాలని తీర్పు ఇచ్చింది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో హిందువుల తరఫున న్యాయవాది కేశవ పరాశరన్ వాదించి గెలిపించారు. ఆయన గురించి ఇప్పుడు చూద్దాం..
రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో హిందువుల పక్షాన సుప్రీంకోర్టు న్యాయవాది కె పరాశరన్ వాదించి, గెలిచారు. ఆయన భారతదేశ మాజీ అటార్నీ జనరల్ గా పనిచేశారు. తమిళనాడులో జన్మించిన పరాశరన్ 1958లో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో అటార్నీ జనరల్ గా పనిచేశారు. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమంలో ఉన్న మహిళల ప్రవేశం పై నిషేధాన్ని సమర్థించేందుకు నాయర్ సర్వీస్ సొసైటీ తరపున వాదించారు.
Ads
పరాశరన్ ఎమర్జెన్సీ టైమ్ లో తమిళనాడు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశాడు. 1980లో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. రామమందిరం కేసు కోర్టులో విచారన జరుగుతున్న సమయంలో 93 సంవత్సరాల పరాశరన్‌ను వాదనలు వినిపించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశించారు. అయితే శ్రీరాముడంటే అచంచలమైన విశ్వాసం ఉన్న పరాశరన్ దేవుని కార్యాన్ని భక్తీ శ్రద్దలతో పూర్తి చేశారు. రాముడికి అనుకూలంగా వాదిస్తుండడంతో నిలబడే వాదిస్తానని కోర్టుకు చెప్పారు. 40 రోజుల పాటు సుప్రీం కోర్టులో కేసు వాదించిన ఆయన, ఆ సమయంలో బూట్లు కూడా ధరించలేదు.
కేశవ పరాశరన్ రామమందిరం కేసులో వాదించడం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దేవుడి న్యాయవాది అనిపించుకున్నారు. సుప్రీంకోర్టులో విజయవంతంగా వాదించి 5 శతాబ్దాల పోరాటానికి ముగింపు చెప్పిన కేశవ్ పరాశరన్‌ను “భారత చట్టాల పితామహుడు” అని మద్రాసు హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పిలిచారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పడిన తరువాత కేశవ పరాశరన్ మొదటి ట్రస్టీగా ఎంపికయ్యారు.