Ads
మలయాళ సినీ ఇండస్ట్రీ నుండి వచ్చే సినిమాలు విభిన్నమైన కాన్సెప్ట్స్ తో తెరకెక్కున్నాయి. ఈ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ కాన్సెప్టులు, చాలా సహజ సిద్ధంగా రూపొందే మలయాళ చిత్రాలకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు.
Ads
ఈ క్రమంలో తాజాగా ఒక సూపర్ హిట్ మలయాళ మూవీ ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‍స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటుగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో ఈ మూవీ అందుబాటులో వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఓటీటీలో రిలీజ్ అయ్యే మలయాళ సినిమాలకి తెలుగులో అభిమానులు ఉన్నారు. దాంతో తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మలయాళ చిత్రాలను తెలుగులోకి అనువదించి, మరీ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలు తెలుగులో రిలీజై తెలుగు ఆడియెన్స్‌ను అలరించాయి.
తాజాగా వాలట్టి అనే మూవీ నవంబర్ 7 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం డాగ్స్ లవ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఎలాంటి వీఎఫ్‌క్స్ వాడకుండా రియల్ డాగ్స్ ను నటులుగా తెరకెక్కించిన మొదటి ఇండియన్ మూవీ వాలట్టీ. ఈ మూవీ జులై 21న థియేటర్లలో రిలీజ్ అయ్యి, మలయాళ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. టామీ అనే పేరు గల గోల్డెన్ రిట్రైవర్ కు చెందిన డాగ్, బ్రహ్మణ ఫ్యామిలీ పెంచుకునే అమలు అనే పేరు గల కాకర్ స్పేనియల్ డాగ్ మధ్యప్రేమకథ ప్రధానంగా సాగే మూవీ వాలట్టి. ఈ చిత్రంలో డాగ్స్ కు రోషన్ మాథ్యూ, సౌబిన్ షాహిర్, రవీనా రవి, సైజు కురుప్, సన్నీ వైన్, ఇంద్రన్స్, అజు వర్గీస్, రజినీ హరిదాస్ వంటి యాక్టర్స్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
Also Read: అమలా పాల్ లాగే…రెండు పెళ్లిళ్లు చేసుకున్న 11 మంది సినీ సెలబ్రిటీలు వీరే.!