సందీప్ రెడ్డి సక్సెస్ అవ్వడానికి కారణం అయిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? సందీప్ మీద నమ్మకంతో అమెరికా వదిలేసి మరీ..?

Ads

ప్రణయ్ రెడ్డి వంగా అంటే అంతగా తెలియకపోవచ్చు. అయితే ఈ పేరు వినగానే గుర్తొచ్చే పేరు మాత్రం  సందీప్ రెడ్డి వంగా అని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి, ఇప్పుడు యనిమాల్ మూవీతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారారు.

Ads

ఈ మూవీ పై రిలీజ్ కు ముందు నుండే విపరితమైన బజ్ ఏర్పడింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ప్రణయ్ రెడ్డి వంగా ఎవరో కాదు సందీప్ రెడ్డి వంగకు అన్నయ్య. అంతేకాకుండా యనిమాల్ మూవీ నిర్మాత.
సందీప్ వంగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్న సమయంలో నిర్మాతల నుండి చాలా  ఇబ్బందులు వచ్చాయట. దర్శకుడు అనుకున్నట్టుగా సినిమాను తెరక్కేకించాలంటే తగినంత లిబర్టీ ఇవ్వాలి. అప్పుడే దర్శకుడు అనుకున్నట్టుగా సినిమాను తెరకెక్కించగలడు. నిర్మాతల నుండి వచ్చిన సమస్యల వల్లనేమో, తన అన్నయ్య ప్రణయ్ రెడ్డి నిర్మాణంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని పూర్తి చేశాడు.
ఆ మూవీ రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ టాక్ తో కాసుల వర్షం కురిపించింది. ఆ మూవీతో ఇద్దరు అన్నదమ్ములు మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రణయ్ వంగా, సందీప్ ని అర్థం చేసుకుని, పూర్తి లిబర్టీని ఇస్తాడట. అందువల్లే అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సందీప్ తెరకెక్కించారని టాక్. ఈ రెండు చిత్రాలు సంచలన విజయం సాధించి, ప్రణయ్ రెడ్డికి లాభాలను తీసుకువచ్చాయి.
టీ సీరీస్ తో కలిసి ప్రణయ్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. మూవీ బడ్జెట్ రూ. 200 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబడుతోంది. ఈ మూవీ లాభాలలో ప్రణయ్ రెడ్డి షేర్ రూ.120-150 కోట్ల వరకు  ఉండొచ్చని అంటున్నారు. అర్జున్ రెడ్డి ముందు ప్రణయ్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసేవారు. ఈ మూవీకోసం జాబ్ విడిచిపెట్టి, ప్రొడ్యూసర్ గా మారారు.

Also Read: సూపర్ స్టార్ “రజనీకాంత్” వేళ్లు ఇలా ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఏంటంటే..?

Previous articleఏలూరులో ఎవరికి సాధ్యం కాని రికార్డ్… ఎన్టీఆర్, బాల‌య్య కి మాత్రమే సొంతం..ఏంటంటే.?
Next article“శ్రీలీల”ను చూసి ఆ అమ్మే.. ఈ అమ్మగా వచ్చింది.. అంటున్న నెటిజన్స్.! బయోపిక్ కూడా తీయాలంట.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.