Ads
ఆడపిల్ల తండ్రి అంటే కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి సాగనంపడేమే కాదు, కూతురు అత్తవారింట్లో వేధింపులకు గురి అవుతుంటే ఆమెకు అండగా ఉండాలి. అలా కష్టాలలో ఉన్న తన కూతురిని ఒక తండ్రి టపాసులు పేలుస్తూ, మేళతాళాలతో ఇంటికి తీసుకువచ్చాడు.
భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక బాధపడుతున్న కూతురును ఆమె తండ్రి ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు. ఈ అరుదైన ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా సంవత్సరం క్రితం తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించాడు. పెళ్లి అయిన కొన్ని రోజులకే సచిన్ కుమార్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అది మాత్రమే కాకుండా సచిన్ కుమార్ కు అంతకు ముందే మరో యువతితో పెళ్లి జరిగినట్లుగా తెలిసింది. తల్లి దండ్రులు చెప్పినందువల్ల, సాక్షి గుప్తా సర్దుకుపోవడానికి చాలా ప్రయత్నించింది.
Ads
కానీ పెళ్లి అయ్యి, సంవత్సరం గడిచినా కూడా భర్త వేధింపులు ఏ మాత్రం తగ్గకపోవడంతో, అతనితో కలిసి ఉండలేననే నిర్ణయానికి వచ్చింది. అదే విషయాన్ని ఆమె తన తండ్రికి చెప్పగా, కూతురు నిర్ణయాన్ని ప్రేమ్ గుప్తా అంగీకరించించాడు. అక్టోబర్ 15న (ఆదివారం) ప్రేమ్ గుప్తా అల్లుడి ఇంటికి వెళ్లి తన కుమార్తె సాక్షి గుప్తాను పుట్టింటికి తీసుకువచ్చాడు. అది కూడా టపాసులు పేలుస్తూ, బ్యాండ్ మేళాల మధ్య ఊరేగిస్తూ కుమార్తెను ఇంటికి తీసుకువచ్చాడు.
ఆమెకు పుట్టింట్లో వారు ఘనంగా స్వాగతం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మధ్యమాలలో వైరల్ అవుతోంది. ప్రేమ్ గుప్తా మాట్లాడుతూ, ‘కుమార్తెలు చాలా విలువైన వారని, అత్తవారింట్లో వారికి వేధింపులు ఎదురైతే ఆమెకు పుట్టింటివారు మద్ధతుగా నిలవాలని, వారిని గౌరవంగా చూసుకోవాలని’ వెల్లడించారు. ఇది ఇలా ఉంటే సచిన్ కుమర్ తో విడాకుల కోసం కోర్టులో కేసు వేశారని తెలుస్తోంది.
watch video:
Also Read: ప్రవళిక కేసులో ట్విస్ట్…అతన్ని శిక్షించాలి అంటూ సంచలన విషయాలు బయటపెట్టిన తల్లి.!