Ads
ఎంతో ఉత్కంఠతో టీం ఇండియాకి, ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచి కప్ ని ఇంటికి తీసుకెళ్లింది. ఆస్ట్రేలియా కప్ గెలవడం ఇది ఆరవ సారి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు, 50 ఓవర్లలో 240 పరుగుల స్కోర్ చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, 4 ఓవర్లలో 241 పరుగులు చేసి కప్ గెలుచుకుంది. ఇప్పటి వరకు టీం ఇండియా ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇండియా ఈసారి ఎలాగైనా కప్ కొడుతుంది అని చాలా నమ్మకంగా ఉన్నారు.
కానీ నిన్న పరిస్థితి తారుమారు అయ్యి ఇండియా ఓడిపోయింది. ఇందుకు పిచ్ సహకరించకపోవడం కూడా ఒక ప్రాబ్లం అని అన్నారు. అయితే, ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా కప్ గెలిచిన తర్వాత పార్టీకి సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. అందులో ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన మార్ష్ నిన్న గెలిచిన కప్ మీద తన కాళ్ళని పెట్టి కూర్చున్నారు. ఈ ఫోటోని పాట్ కమిన్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
Ads
దాంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటో చూసిన చాలా మంది ఆగ్రహానికి గురవుతున్నారు. “కప్ గెలిస్తే నెత్తిన పెట్టుకొని పూజలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇలా కాళ్ళ కింద పెట్టుకోవడం ఏంటి? దీనికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా కామెంట్స్ చేసిన వారిలో చాలా మంది ఇండియన్స్ ఉండడం గమనార్హం.
ఇప్పటికే ఓడిపోయి బాధగా ఉన్న మన వాళ్ళకి, ఈ పిక్చర్ చూసిన తర్వాత ఆ బాధ ఇంకా రెట్టింపు అయ్యింది అని చెప్పవచ్చు. “మనకే కప్ వచ్చి ఉంటే, మనం దాన్ని ఇలా పెట్టుకునే వాళ్ళం కాదు ఏమో” అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ ట్రవిస్ హెడ్ 137 పరుగులు చేసి సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడారు.
ALSO READ : WORLD CUP2023: ఫైనల్ లో ఇండియా ఓడిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఇవే…అదే ఆస్ట్రేలియాకి ప్లస్ అయ్యింది.!