Ads
మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికి తెలిసిందే. ఆయన ఎలాంటి సినీ నేపద్యం లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆయన కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి ఆ తరువాత హీరోగా ఛాన్స్ లు అందుకున్నారు.
Ads
హీరో అయిన తరవాత చిరంజీవి తన నటనతో మాత్రమే కాకుండా డ్యాన్స్ తో కూడా చాలా మంది అభిమానులను పొందుకున్నారు. ఆయన ఒకే తరహా చిత్రాలలో కాకుండా అన్ని రకాల చిత్రాలలో నటించి ఆడియెన్స్ ని అలరించాడు. ఇక ఎంత పెద్ద హీరోకు అయినా సరే వారి కెరీర్ లో అపజయాలు తప్పవు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనూ నిరాశపరిచిన చిత్రాలు ఉన్నాయి. వాటిలో భారీ అంచనాల మధ్య వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న ‘అంజి’ మూవీ చిరంజీవిని అన్నిటికన్నా ఎక్కువ నిరాశకు గురిచేసింది.
కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. 1997 లో భారీ బడ్జెట్ తో అంజి సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. షూటింగ్ మొదలైనప్పటి నుండి మీడియాలో తరచూ ఈ సినిమాకు సంబంధించిన వార్తలు కనిపిస్తూ ఉండేవి. ఇక ఈ సినిమాను పూర్తి చేయడానికి ఏడు సంవత్సరాలు పట్టింది.ఈ చిత్రం కోసం అప్పట్లోనే హాలీవుడ్ లెవల్ లో గ్రాఫిక్స్ ను ఉపయోగించారు. చాలా కష్టపడి గ్రాఫిక్ వండర్ గా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు మాటలు అందించారు. ఆ సమయంలోనే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం 2004లో రిలీజ్ అయ్యింది.
కాగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. అంచనాలు అందుకోలేక సినిమా ప్లాప్ అయినప్పటికి గ్రాఫిక్స్ పరంగా అవరదులు వచ్చాయి. అంతేకాకుండా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. ఇక ఈ మూవీలో మాసిన చొక్కాతో కనిపించడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఓకే చొక్కాను రెండు సంవత్సరాల పాటు ధరించారంట. అది కూడా ఆ చొక్కాను ఉతకకుండా ధరించారు.
Also Read: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్నతనంలో ఏ వ్యాధితో బాధపడ్డారో తెలుసా?