Ads
టాలీవుడ్ హీరో మన్మధుడు నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ. ఇందులో నాగార్జునకు జోడీగా బ్యూటిఫుల్ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన విజయ్ బిన్ని తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్నారు. అంటే నా సామిరంగ సినిమాతో విజయ్ బిన్ని దర్శకుడిగా తెలుగులోకి డెబ్యూ ఇచ్చారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా నా సామిరంగ సినిమా నుంచి మరో పాత్రను తాజాగా రివీల్ చేశారు మేకర్స్. కాగా సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో నా సామిరంగ లోని నటీనటలు పాత్రలను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తున్నారు మేకర్స్. ముందుగా నాగార్జున్ గ్లింప్స్ వీడియోతో పాత్రను పరిచయం చేశారు. అనంతరం ఆషికా రంగనాథ్ పాత్రను అందమైన చీరకట్టుతో పాటు స్పెషల్ గ్లింప్స్‌తో రివీల్ చేశారు. ఇలా ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Ads
తాజాగా మరో క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్ లో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు మిర్నా మీనన్. మొదటిసారి ఆ పోస్టర్ ని చూసినవారికి ఆ హీరోయిన్ ఎవరు అన్నది గుర్తుపట్టడం కష్టమే. అయితే తాజాగా జనవరి 4న నా సామిరంగ సినిమా నుంచి మిర్నా మీనన్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో మిర్నా మీనన్ మంగగా కనిపించనుంది.
అయితే ఈ సినిమాలో మిర్నా మీనన్ అల్లరి నరేష్ సరసన నటించనుంది. కాగా తాజాగా విడుదల చేసిన ఆ పోస్టర్‌లో మిర్నా మీనన్ చీరకట్టుకుని, పద్ధతిగా బొట్టు పెట్టుకుని, మెడలో మల్లెపూలతో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా ఎంతో అందగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. మిర్నా మీనన్ జైలర్ సినిమాలో రజినీకాంత్ కోడలిగా నటించారు.