“లియో” మూవీలో ఈ పొరపాటును గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

Ads

ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. రాజమౌళి తర్వాత డైరెక్టర్ గా ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్న లోకేష్ అని చెప్పవచ్చు. కేవలం లోకేష్ కనకరాజ్‌ పేరు చూసే ఆడియెన్స్ థియేటర్లకు వెళ్ళే పరిస్థితి ఉంది.

Ads

కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా లోకేష్ తెరకెక్కించిన ‘లియో’ మూవీ దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీలో మిస్టేక్ అంటూ నెట్టింట్లో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
లోకేష్ కనకరాజ్‌, విజయ్ దళపతి కాంబోలో తెరకెక్కిన రెండవ సినిమా లియో. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించారు. సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలలో నటించారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. అయితే ట్రైలర్ తో టాక్ మారిపోయింది. ఇంగ్లీష్ కాపీ మూవీ అని కొందరు, తెలుగు కాపీ మూవీ అని అంటూ ఈ మూవీ పై నెగటివ్ టాక్ మొదలైంది.
లోకేష్ మార్క్ యాక్షన్ తో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఖైదీ, విక్రమ్ సినిమాల రేంజ్ లో ఆకట్టుకోలేదని లోకేష్ అభిమానులు అంటున్నారు. అయితే దళపతి ఫ్యాన్స్ కు మాత్రం నచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించిన, లియో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే, సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ గురించిన వార్తలు ఏదో విధంగా హల్చల్ చేస్తూనే ఉన్నాయి.
తాజాగా సినీఫిల్స్_మూవీ అప్‌డేట్స్ అనే ఇన్ స్టా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో “లియోనే పార్తిబన్ అనే సందేహంతో హీరోను నువ్వు లియోవా, పార్తిబన్ వా అంటూ ప్రతి పాత్ర అడుగుతూనే ఉంటుంది. దానికి బదులు ఒక్క డీఎన్ఏ టెస్ట్ చేస్తే లియోనే పార్తిబన్ అవునా కదా అనే విషయం తెలిసిపోతుంది. రౌడీలకు ఈ విషయం తెలియకపోయినా, పోలీస్ ఆఫీసర్ గౌతం మీనన్ కూడా  ఉంటారు. లోకేష్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు”. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: కేవలం ఒక్క డ్రెస్ తోనే పూర్తి చేసిన 8 సినిమాలు..

Previous article“నిజం గెలవడం వల్లే చంద్రబాబు జైల్లో ఉన్నారు..! అంటూ… “నారా భువనేశ్వరి” యాత్రపై కొడాలి నాని కామెంట్స్..!
Next articleచాలా మంది మనుషులకంటే ఈ కుక్కలే నయం అనుకుంటా..? ఇవి చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.