మోడీ వల్ల మాల్దీవ్స్ టూరిజంపై దెబ్బ పడడం ఏంటి..? అసలు ఏం జరిగింది…?

Ads

ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుల్లో ప్రధాన మోడీ ఒకరు. ఇండియా సూపర్ పవర్ గా మారుతుంది అంటే దానికి కారణం ప్రధాని మోడీనే. మోడీ మాటకి భారతదేశంలో అత్యంత విలువ ఉంది.మోడీ ఒక్క మాట చెప్పారంటే యావత్తు భారత ప్రజానీకం అందరు అదే ఫాలో అవుతారు. ఇప్పుడు మోడీ ఇచ్చిన ఒక్క పిలుపు కారణంగా మాల్దీవులకు పెద్ద దెబ్బ పడింది.

మాల్దీవులు చిన్న ద్వీపదేశం…పర్యాటక రంగం దాని ప్రధాన ఆదాయం. ఈ దేశానికి భారతదేశం నుండి ఎక్కువ శాతం ఆదాయం కూడా వస్తుంది. ఆ దేశం ఇప్పుడు భారతదేశ మీద తన అక్కసు వెళ్ళగక్కింది.

modi maldives tourism effect

అంతేకాదు తమ దేశంలో ఇస్లాం మతం ఆచరణలో ఉంది కాబట్టి ప్రపంచంలో ఇస్లాం దేశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని వ్యతిరేకిస్తే తనకు తిరగులేదు అనుకుంది. కాని చివరికి బొక్కా బోర్లా పడ్డది. ఇంతకీ ఆ దేశం చేసిన తప్పేంటి? ఒక బుల్లి దేశం ఒక్కసారిగా వార్తల్లోకి ఎందుకు ఎక్కింది.. సామాజిక మాధ్యమాలలో ఎందుకు చర్చనీయాశం అయింది? అనే వివరాలను ఒకసారి పరిశీలిస్తే…

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్య ద్వీప్ పర్యటనకు వెళ్లారు. లక్ష్య ద్వీప్ ను భారతీయులు తమ విహారయాత్రలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. అయితే దీనిపై మాల్దీవుల మంత్రులు మండిపడ్డారు. లక్షద్వీప్ లో మాల్దివుల్లాగా సౌకర్యాలు కల్పించడం సాధ్యమవుతుందా అంటూ ప్రశ్నించారు. భారత్ ఒక మురికి దేశమని, అంతే కాకుండా నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పప్పెట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు.భారత్ ను ఆవు పేడతో పోల్చారు. మరో ఇద్దరు మంత్రులు కూడా ఇదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Ads

ఈ విమర్శలు వల్ల భారతదేశం నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.దేశంలోని సచిన్ టెండూల్కర్ నుంచి మొదలుపెడితే హార్దిక్ పాండ్యా వరకు దీనిపై స్పందించారు. భారతదేశాన్ని, భారతదేశ ప్రభుత్వాన్ని మాల్దీవుల మంత్రులు విమర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై భారతీయులు లక్ష్య ద్వీప్ పర్యటనకే వెళ్లాలని.. మాల్దీవులను బాయికాట్ చేయాలని కోరారు. దీంతో ఇప్పటివరకు మాల్దీవ్ పర్యటనకు బుక్ చేసుకున్న భారతీయులందరూ తమ ట్రిప్పులను క్యాన్సిల్ చేసుకున్నారు. చాలావరకు ఫ్లైట్లు రద్దు అయిపోయాయి.


భారతదేశంలో ఉన్న అందమైన తీర ప్రాంతాలను, బీచ్ లను సందర్శించాలని బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, శ్రద్ధ కపూర్ సోషల్ మీడియా వేదికగా భారతీయులను కోరారు. అంతేకాదు తను 50వ పుట్టినరోజును కొంకన్ తీరంలో జరుపుకున్నానని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎక్స్ లో పేర్కొన్నారు. దీంతో బాయ్ కట్ మాల్దీవ్స్ ట్రెండింగ్ అయింది. దేశ విదేశాల్లో స్థిరపడిన భారతీయులందరూ కూడా దీనికి మద్దతు తెలిపారు. ఒకసారిగా భారత్ నుండి మాల్దీవులు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో మాల్దీవ్స్ కు భారతీయులు గట్టి స్ట్రోక్ ఇచ్చారని చెప్పాలి.

Previous articleత్రివిక్రమ్ సినిమాల్లో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా ?
Next articleఇలా తయారు అయ్యారు ఏంటి..? వీళ్లు కూడా మనుషులే కదా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.