Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ ల ద్వారా హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ లు తెరమీదకి వచ్చి ఆడియన్సు సప్రైజ్ చేసేవి. అలా ఒక అన్ ఎక్స్పెక్టెడ్ కాంబో సినిమా మిస్ అయింది. అదే ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని సూపర్ స్టార్ మహేష్ బాబు,నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కాంబినేషన్ లో రావలసిన సినిమా…!
యస్ మీరు చదివింది నిజమే. నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి చూడడానికి హీరోయిన్ లా ఉంటుంది. నేడు తెలుగు తెరపై ఉన్న హీరోయిన్ లు ఆమె అందం ముందు నిలబడురు అంటే అతిశయోక్తి కాదు. అంత అందంగా ఉంటుంది ఆమె.
కానీ నటుల వంశం నుంచి వచ్చిన ఆమె నటన ఎంచుకోకుండా తర్వాత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ని వివాహం చేసుకుని బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు హెరిటేజ్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం అతడు. తెలుగు సినిమా చరిత్రలో అతడు సినిమాకి ఉన్న ఫ్యాన్ బేస్ ఏ సినిమాకి త్రివిక్రమ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మేజర్ హైలెట్స్.
Ads
ఈరోజుకి కూడా అతడు సినిమా టీవీలో వస్తుందంటే టీఆర్పి రేటింగులు ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. త్రిష కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా నారా బ్రాహ్మణి అయితే బాగుంటుందని చిత్ర టీం భావించింది. ఇదే విషయాన్ని నందమూరి బాలకృష్ణ వద్ద ప్రస్తావించగా ఆయన వెంటనే నో చెప్పారు. బ్రాహ్మిని ఒపీనియన్ అడగగా ఆమెది ఇదే సమాధానం.
తనకి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పారు.ఒకవేళ సూపర్ స్టార్ మహేష్ బాబు-నారా బ్రాహ్మణి కాంబినేషన్ లో అతడు సినిమా గాని వచ్చి ఉంటే ఏ రేంజ్ హిట్ అయ్యేదో చెప్పాల్సిన పనిలేదని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:“తమ్ముడు” హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే.?