వరల్డ్ కప్ లో టీం ఇండియాకి చీర్ చేస్తున్న ఈ “మిస్టరీ గర్ల్” ఎవరో తెలుసా.?

Ads

వన్ డే వరల్డ్ కప్ లో టీం ఇండియా వరస విజయాలతో దూసుకుపోతుంది. శనివారం చిరకాల ప్రత్యర్థి అయిన పాక్ ను ఓడించి పాయింట్స్ టేబుల్ లో ఒకటవ స్థానంలోకి చేరింది. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి టోర్నీలో బోణి కొట్టిన తర్వాత రెండో మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై సులభంగా విజయం సాధించింది భారత్. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉంది భారత్. బౌలింగ్, బాటింగ్, ఫీల్డింగ్..ఇలా అన్నిటిలో బలంగా కనిపిస్తుంది టీం ఇండియా. ఈ రోజు బాంగ్లాదేశ్ తో తలపడుతుంది భారత్.

ఇది ఇలా ఉంటె…ప్రతిసారి ఐపీఎల్ లో మిస్టరీ గర్ల్ ఉన్నట్టే. ఈ సారి భారత్ జట్టుకు చీర్ చేస్తూ ఓ అమ్మాయి కెమెరా కంటికి చిక్కింది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియం లో ఈ అమ్మాయి కన్పిస్తుంది. ఆసియా కప్ లో కూడా దర్శనమిచ్చింది ఈమె. ఆమె పేరు వాజ్మా అయూబీ. ఆమె మోడల్, వ్యాపారవేత్త. క్రికెట్ అంటే అభిమానం ఎక్కువ. ఆఫ్గనిస్తాన్ కి చెందిన ఆమె…ఆ జట్టును సపోర్ట్ చేయడానికి ఇండియా కి వచ్చింది. ఆమెకు భారత్ క్రికెట్ టీం అంటే కూడా ఇష్టం అంట. భారత జెర్సీలో ఆమె దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆసియా కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో ఇండియాకు జై కొట్టింది. మెన్ ఇన్ బ్లూ విజయం సాధించాలని ఆకాంక్షించడమే కాకుండా…నా సెకండ్ హోమ్ టీంకు శుభాకాంక్షలు అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టింది. ఈమె పెట్టిన పోస్ట్ కు భారత్ క్రికెట్ అభిమానులు ఆనందిస్తుంటే పాక్ ఫాలోవర్స్ మాత్రం కాస్త ఆగ్రహిస్తున్నారు.

వాజ్మా అయూబీ కి సోషల్ మీడియాలో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆఫ్గనిస్తాన్ లో జరిగిన పలు మ్యాచ్లకు ఆమె హాజరయ్యింది. టీమిండియాను సపోర్ట్ చేస్తూ బైజుస్ లోగో తో పాటు ఇండియా అని రాసి ఉన్న బ్లూ కలర్ టీ షర్ట్ ధరించిన ఈమె ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఐపీఎల్ 2023 లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్‌ మ్యాచ్ కి కూడా ఆమె హాజరైంది. ఇండియన్ సినిమాలో పని చేయడం ఆమె కోరిక అంట. మరి మన సినిమా వాళ్ళు అవకాశం ఇస్తారేమో చూడాలి.

Previous article“గుప్పెడంత మనసు” లో సరికొత్త ట్విస్ట్…మహేంద్రను కలసిన ఆ కొత్త వ్యక్తి ఎవరు?
Next articleTIGER NAGESWARA RAO REVIEW: “టైగర్ నాగేశ్వరరావు” సినిమా ఎలా ఉంది అంటే.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.