Ads
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు మాయా మూవీ వచ్చేసింది. పెద్ద సినిమాల హడావిడి మధ్యలో ధైర్యంగా వచ్చిన ఈ చిన్న సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం పదండి..
టైటిల్: మాయలో
నటీనటులు: నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, ఆర్జే హేమంత్
దర్శకత్వం: మేఘా మిత్ర పేర్వార్
నిర్మాణ సంస్థ: ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్
నిర్మాతలు: షాలిని నంబు, రాధా కృష్ణ నంబు
విడుదల తేది: 15-12-2023
స్టోరీ:
మాయ(జ్ఞానేశ్వరి).. ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి కి సిద్ధపడుతుంది. కతర పెళ్లికి రమ్మని చిన్ననాటి స్నేహితులు క్రిష్(నరేష్ అగస్త్య), సింధు(భావన)లను తన పెళ్లికి ఇన్వైట్ చేస్తుంది. పేరుకు చిన్నప్పటినుంచి ఫ్రెండ్సే అయినప్పటికీ వీళ్లకు ఒకరంటే ఒకరికి అంతర్గతంగా పడదు. అయినా సరే ఈ ఇద్దరు ఒకే కారులో పెళ్లికి బయలుదేరుతారు ఇక ఈ ప్రయాణం ఏ కథకు ముగింపు అవుతుంది? ఫైనల్ గా సినిమాలో ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరి మధ్య ఫ్లాష్ బ్యాక్ లో స్టోరీ ఏంటి? అన్న విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫ్రెండ్స్ లవ్వు ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ పైన సినిమాలు బాగా వస్తున్నాయి. ఇటువంటి సినిమాలు థియేటర్లలో క్లిక్ అయినా కాకపోయినా.. కంటెంట్ బాగా ఉంటే ఓటీటీ లో సూపర్ గా క్లిక్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా అలాంటి మూవీ. ఓ పక్క ఫ్రెండ్షిప్ తో పాటు లవ్ స్టోరీ కి కామెడీ జోడించి స్మూత్ గా సినిమాని ముందుకు నడిపించారు.
మూవీ ఎక్కువసేపు రోడ్డు మీద కార్ ట్రావెలింగ్ లోనే గడిచిపోతుంది. ఇక నరేష్ ,భావన మధ్య వచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ద్వేషం చివరికి ఏ దశకు చేరుకుంటుంది అనే విషయాన్ని కొంచెం కామెడీ జోడించి ..ఎమోషనల్ గా ఎస్టాబ్లిష్ చేశారు.నటీనటుల పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంది. ఎవరి పాత్ర పరిధికి తగినట్లుగా వాళ్లు అద్భుతంగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
- మూవీలో కామెడీ బాగుంది.
- ఫ్రెండ్స్ మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ లో ఉన్న అన్ని వేరియేషన్స్ ని అద్భుతంగా చూపించారు.
- యూత్ కు బాగా నచ్చే మూవీ.
మైనస్ పాయింట్స్:
- స్టోరీ రొటీన్ గా ముందు జరిగేది ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది.
- అక్కడక్కడ కాస్త సాగదీసినట్లుగా బోర్ కొడుతుంది.
- డైలాగ్స్ పై మరికొంత కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది.
- రొటీన్ క్లైమాక్స్.
రేటింగ్: 2.75/5
చివరి మాట:యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ..కాబట్టి కామెడీ చిత్రాలు ,యూత్ ఓరియెంటెడ్ చిత్రాలు ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది.