అంపైర్ ని ట్రోల్ చేసారు.. కానీ కోహ్లీ సెంచరీకి కారణమైన ఈ కొత్త MCC రూల్ తెలుసా.?

Ads

విరాట్ కోహ్లీ పూణె వేదికగా గురువారం నాడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టి, వరల్డ్ రికార్డ్  సృష్టించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసి, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత ఫాస్ట్ గా 26000 రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

Ads

బంగ్లాదేశ్ నిర్దేశించిన 257 పరుగుల టార్గెట్ ను కోహ్లీ చేసిన సెంచరీతో 41.3 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో టీంఇండియా విజయం సాధించింది. అయితే కోహ్లీ సెంచరీ చేసే సమయంలో అంపైర్ రిచర్డ్ వైడ్ బాల్ ఇవ్వకుండా సెంచరీకి సాయం చేశాడని తప్పుబడుతున్నారు. కానీ సాయం చేసింది న్యూ ఎంసీసీ రూల్ అని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ కప్ 2023లో బంగ్లాదేశ్‌ పై విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీని చేయడంతో భారత జట్టు విజయాన్ని సాధించింది. అయితే ఈ విషయంలో అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో తీసుకున్న వివాదాస్పద నిర్ణయం మ్యాచ్ తర్వాత హాట్ టాపిక్ గా మారింది. విరాట్ సెంచరీ చేయడంలో అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో కూడా సాయం చేశారని నెట్టింట్లో మీమ్స్, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు అంపైర్ తీరును తప్పుబడుతూ కామెంట్లు చేస్తున్నారు.
కోహ్లి 97 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ, భారత్ గెలవడానికి రెండు పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఆ సమయంలో బంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అహ్మద్ లెగ్ స్టంప్ వైపు బంతిని వేశాడు. కోహ్లి స్టంప్‌ల వైపుగా  కొంచెం కదిలాడు. ఆ బాల్ కోహ్లీ ప్యాడ్ మీదుగా వెళ్ళగా కీపర్ అందుకున్నాడు. దీంతో వైడ్ అని అంతా అనుకున్నారు. అయితే, అంపైర్ వైడ్ ఇవ్వకుండా, డాట్ బాల్‌గా నిర్ధారించారు. దీని తర్వాత కోహ్లీ రెండు బంతుల్లో భారీ సిక్సర్‌తో 48వ వన్డే సెంచరీని సాధించాడు.
లెగ్ సైడ్‌లో వికెట్ కీపర్ బంతిని పట్టుకున్నప్పుడు వైడ్ ఇవ్వకూడదనే అంపైర్ నిర్ణయంతో అందరూ గందరగోళానికి గురయ్యారు, దీనికి కారణం గతేడాది అక్టోబర్ 1న ఎంసీసీ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. వైడ్ విషయంలో ఎంసీసీ నియమం మార్చింది. బౌలర్ బౌలింగ్ చేసే సమయంలో బ్యాట్స్ మెన్  స్టాండింగ్ పొజిషన్ మార్చుకున్నట్లయితే, బంతి బ్యాటర్ ముందు పొజిషన్ మీదుగా వెళ్ళినట్లయితే అది వైడ్‌గా వర్తించబడదని తెలిపింది.
ఎంసీసీ లా 22.1 ప్రకారం, బ్యాటర్ పొజిషన్ బట్టి వైడ్‌ను ప్రకటిస్తారు. బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతిని వేయకముందే కోహ్లి లెగ్ సైడ్ నుండి కొంచెం ఆఫ్ సైడ్ వైపుగా జరిగాడు. దాంతో బంతి కోహ్లి ప్యాడ్ మీదుగా కీపర్ హ్యాండ్స్ లోకి వెళ్లింది. కోహ్లి ముందుకు జరగకుండా అదే స్థానంలో ఉంటే బంతి కోహ్లీ ప్యాడ్లను కానీ, బ్యాట్‌ను కానీ తాకేది. అందువల్ల అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైందేనని తెలుస్తోంది.

Also Read: “జై శ్రీరామ్” అంటే తప్పేంటి…అప్పుడు మన ప్లేయర్స్ మీద రాళ్లు వేసింది మరిచిపోయారా.?

Previous articleసీరియల్ లో సంప్రదాయంగా కనిపించే “త్రినయని”…ఇంత స్టైలిష్ గా ఉంటుందా.?
Next articleన్యూజిలాండ్ తో మ్యాచ్ కి ముందు టీమ్ ఇండియాకి పెద్ద షాక్..! అతను లేకుంటే కష్టమేనా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.