OTT లోకి కొత్తగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ చూశారా..? దీని కథ ఏంటంటే..?

Ads

ఈమధ్య ఎక్కడ చూసినా మలయాళీ సినిమాలు జోరు ఎక్కువైంది. థియేటర్లలోను, ఓటిటి లోను మలయాళీ సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. సస్పెన్స్ ఓరియెంటెడ్, హర్రర్ మూవీలు, క్రైమ్ ఓరియంటెడ్ మూవీలు, ఫీల్ గుడ్ మూవీలు ఇలా ప్రతి మలయాళ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది.

తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ అనే వెబ్ సిరీస్ కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. 7 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్, ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం….!

new ott release review

ఈ కథ మొత్తం మాళవిక అనే పాత్ర చుట్టూ పెరిల్లూర్’ అనే విలేజ్ చుట్టూ తిరుగుతుంది. మాళవిక ( నిఖిలా విమల్) చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో మేనమామ పీతాంబరం ( విజయ్ రాఘవన్) దగ్గర ఉంటూ 8వ తరగతి వరకూ చదువుకుంటుంది. ఆ స్కూల్ లోనే చదువుతున్న శ్రీకుంటన్ (సన్నీ వెయిన్)ను మాళవిక ఇష్టపడుతుంది. అయితే ఆ తరువాత ఆమె తన సొంత ఊరికి వెళ్లిపోవడంతో శ్రీకుంటన్ ఆమె జ్ఞాపకాలతో ఉండిపోతాడు.

new ott release review

శ్రీ కుంటన్ గల్ఫ్ వెళ్లి జాబు చేసి ఇంటికి తిరిగి వస్తాడు.మాళవిక కూడా పీహెచ్డీ చేసే ప్రయత్నంలో ఉంటుంది. అయితే అనుకోకుండా మాళవికాకి శ్రీకుంటన్ కి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు.మాళవికకి ఉన్న ప్రేమ తగ్గదు కానీ శ్రీకుంటన్ ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. బాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు.

new ott release review

పెరిల్లూర్ గ్రామానికి చాలా కాలంగా మాళవిక మేనమామ పీతాంబరం ప్రెసిడెంటుగా ఉంటాడు. ఈ సారి అతను ప్రెసిడెంట్ గా వద్దని ఒక వర్గం వారు ఎదురు తిరుగుతారు. దాంతో అతను మాళవికను ఒప్పించి నామినేషన్ వేయిస్తాడు. నిజానికి మాళవిక దృష్టి పీహెచ్ డీ పై ఉంటుంది. అయితే శ్రీకుంటన్ ను పెళ్లి చేసుకుని ఇదే ఊరిలో ఉండాలి కదా అని తల్లి నామినేషన్ వేయడానికి ఒప్పిస్తుంది. అయితే నిహారిక అనే అమ్మాయికి పెళ్లి అయిందనే విషయం తెలియక ఆమెపై మనసు పారేసుకున్న శ్రీకుంటన్ తనకి మాళవిక నచ్చలేదని కబురు చేస్తాడు.

Ads

new ott release review

శ్రీకుంటన్ తో పెళ్లి అవుతుందనే ఉద్దేశంతో నామినేషన్ వేసిన మాళవిక ఆ ఊరికి ప్రెసిడెంట్ అవుతుంది. ఆమె పేరుతో రాజకీయం చేస్తూ మేనమామ పీతాంబరం అక్రమాలకు పాల్పడుతూ ఉంటాడు. ఆధారాలతో అతని అవినీతిని నిరూపించే సమయం కోసం శోభన్ (అశోకన్) అనుచరులు వెయిట్ చేస్తుంటారు. ఇక శ్రీకుంటన్ ఒక వైపున డబ్బున్న అమ్మాయిలకు కోసం ఎరవేస్తూ చివర్లో కంగుతింటూ ఉంటాడు. మరో వైపున ఊళ్లో మాళవికను ఎదుర్కోలేకపోతూ ఉంటాడు.

new ott release review

ఎప్పటికప్పుడు తన పదవికి రాజీనామా చేసి, పీహెచ్ డీ వైపు వెళ్లాలని మాళవిక ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకు ఆమె మేనమామ అడ్డుపడుతూ ఉంటాడు. ఒకసారి ఆయన వేరే వారి దగ్గర లంచం తీసుకుని శ్రీకుంటన్ సైడ్ బిజినెస్ గా నడుపుతున్న షాప్ ను మూసేయిస్తాడు. దాంతో శ్రీకుంటన్ కోపంతో రగిలిపోతాడు. ప్రతీకారంతో అతను చేసిన ఒక పని వలన మాళవిక పీహెచ్ డీ చేసే అవకాశాన్ని కోల్పోతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ.

new ott release review

దీపు ప్రదీప్ రాసిన కథ కథను దర్శకుడు ప్రవీణ్ చంద్రన్ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది.
చాలా సింపుల్ గా సాగిపోతూ కామెడీని హైలెట్ చేస్తూ ఒక ఊరిలోని పాత్రలు, రాజకీయాలు, అక్కడి ప్రజల స్వభావాలు రాజకీయాలపై చూపించే ఇంట్రెస్ట్ ఎలా ప్రతిదీ చాలా సింపుల్ గా చూపించారు. కథలో పెద్ద మలుపులు ట్విస్టులు ఏముండవు కానీ,హాయిగా నవ్వుకుంటూ చూసేవచ్చు.

new ott release review

నిఖిలా విమల్ చాలా అందంగా కనిపిస్తూ ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. మిగతా నటులు కూడా చాలా సహజంగా తమ పాత్రలో మేరకు బాగా నటించారు.అనూప్ వి శైలజ ఫొటోగ్రఫీ,మజీబ్ సంగీతం కథను బాగా కనెక్ట్ చేశాయి. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో కలిసి చూడగలిగే వెబ్ సిరీస్ గా ఉంటుంది.

Previous article‘దృశ్యం’ మూవీలో నటించిన వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా?
Next article90’s వెబ్ సిరీస్ లో శివాజీ పెద్ద కొడుకుగా నటించిన ఈ అబ్బాయి గురించి తెలుసా..? ఇతను ఎవరంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.