Ads
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఊహించని స్టార్డమ్ సంపాదించుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందాడు.
దానివల్ల రామ్ చరణ్ తరువాత చేయబోయే చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ గా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా #RC15. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాటు, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆపద్భాందవుడు సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో చిరంజీవికి కరెంట్ షాక్ పెట్టిన తరువాత ఆయన నత్తితో మాట్లాడుతూ ఉంటాడు. నత్తితో మాట్లాడిన మాటలు, ఆయన పలికించిన ఎమోషన్ గుర్తుకు ఇప్పటికి చాలామందికి గుర్తుంటుంది. అయితే ఆ సినిమా గురించి ఇప్పుడేందుకు అనే కదా. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అలాంటి ఎమోషన్ ఆడియెన్స్ కి అందించేందుకు ప్రయత్నిస్తున్నారంట.
Ads
తన తండ్రికి ఏం మాత్రం తీసిపోని విధంగా తన ట్యాలెంట్‌ను ప్రదర్శించేందుకు ఈ స్టార్ హీరో తయారవుతున్నాడు. ఇంతకి ఇలాంటి క్యారక్టర్ ఏ సినిమాలో చేస్తున్నాడంటే డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న సినిమాలోనే. ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా రాబోతుంది. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. అందులో రామ్ చరణ్ చేసే ఒక క్యారెక్టర్ నత్తితో బాధపడుతూ పడుతూ ఉండే పాత్ర అంట. ఆయన ఈ క్యారెక్టర్ ను ఛాలెంజ్‌గా తీసుకుని, నత్తి ఫర్ఫెక్ట్ గా వచ్చేందుకు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుస్తోంది.అంతేకాకుండా ఈ విషయంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి దగ్గర సలహాలు కూడా తీసుకుంటున్నారట. చరణ్ ఇంతకుముందు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో చెవుడు క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు మరోసారి తన యాక్టింగ్ ట్యాలెంట్ ను చూపించే ప్రయత్నంలో భాగంగా స్టామరింగ్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ స్టార్ హీరో.
Also Read: హీరో విక్టరీ వెంకటేష్ పరిచయం చేసిన 16 మంది హీరోయిన్స్ వీరే..