Ads
ముఖేష్ అంబానీ కుటుంబం అత్యంత లగ్జరీ, ఖరీదైన కార్లను ఉపయోస్తుంది. వీరి కార్ల గ్యారేజీని జియో గ్యారేజీ అని పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత ఖరీదైన మరియు లగ్జరీ కార్ల గ్యారేజీలో ఇది ఒకటి. అంబానీ గ్యారేజీలో రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ, ఫెరారీ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
తాజాగా వీరి గ్యారేజిలో మరో ఖరీదైన కారుని చేరినట్లు తెలుస్తోంది. ఈ కారును ముఖేష్ అంబానీ నీతా అంబానికి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఈ కారుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ముఖేష్ అంబానీ మరియు అతని ఫ్యామిలీ వారి బిజినెస్, దాతృత్వం, లగ్జరీ లైఫ్ స్టైల్ విషయంలో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. అంబానీ ఫ్యామిలీ దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం. వారి ఇంటిలోని గ్యారేజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాస్ట్లీ కార్లతో నిండి ఉంది. ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ, నీతా అంబానీలు తరచుగా ఇంటి నుండి బయటకు వెళ్ళిన సమయంలో అత్యంత కాస్ట్లీ కార్ కాన్వాయ్‌లలో వెళ్తూ కనిపిస్తారు.
అయితే ఆ కాన్వాయ్‌లో కొత్తగా రోల్స్ రాయిస్ కల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్ యూవీ కనిపించింది. కార్టోక్ నివేదిక ప్రకారం, దీపావళికి ముందు ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీకి రూ. 10 కోట్ల ఎస్ యూవీని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ కారుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో “CS 12 Vlogs” షేర్ చేసింది. ఈ వీడియోలో ‘రోల్స్ రాయిస్’ సంస్థకు చెందిన ‘కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్’ కారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కాన్వాయ్‌లో వెళ్లడం కనిపిస్తుంది. ఈ కారు వేల రూ.10 కోట్లు (ఆన్ రోడ్) ఉంటుందని తెలుస్తోంది.
పెట్రా గోల్డ్ కలర్ షేడ్‌లో ఉన్న ఈ కారు నార్మల్ కార్ల కన్నా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 6.75 లీటర్ ట్విన్ టర్బో, వి12 పెట్రోల్ ఇంజిన్ ఉన్న ఈ కారు 5,000 ఆర్‌పీఎమ్ దగ్గర 563 బీహెచ్‌పీ పవర్, 1600 ఆర్‌పీఎమ్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మాగ్జిమామ్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు. ఇప్పటికే ఇటువంటి కారును బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Ads
Also Read: ఉత్తమ డాక్టర్ గా నేషనల్ అవార్డ్…ఆంధ్రాలోని ఆ హాస్పటల్ కి క్యూ కడుతున్న విదేశీయులు.!