Ads
టాలీవుడ్ లో ఏడాదిగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరితో మొదలైన రీరిలీజ్ ట్రెండ్ బిజినెస్ మెన్ మూవీ వరకు బాగానే కొనసాగింది. పలు సినిమాలు రీరిలీజ్ కలెక్షన్స్ లో రికార్డులు సృష్టించాయి.
Ads
అయితే కొద్ది రోజుల నుండి రీరిలీజ్ హవా తగ్గినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రీరిలీజ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ ఫలితంతో రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాలను రీరిలీజ్ చేయాలని భావించిన ప్రొడ్యూసర్లు వెనక్కు తగ్గుతున్నారని సమాచారం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అదుర్స్. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా, నయనతార, షీలా హీరోయిన్లుగా నటించారు.ఈ మూవీ 2010 లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య కెమిస్ట్రీ, వారి కామెడీ టైమింగ్ మరియు పంచ్‍లు ఆడియెన్స్ ని బాగా అలరించాయి. యాక్షన్ సీన్లు ప్లస్ అయ్యాయి. చారి, నరసింహగా రెండు పాత్రలలో ఎన్టీఆర్ అలరించారు.
13 ఏళ్ల తరువాత ఈ చిత్రాన్ని నవంబర్ 18న రీరిలీజ్ చేశారు. అయితే ఈ క్లాసిక్ మూవీకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. సింహాద్రి రీరిలీజ్ అయ్యి, తొలిరోజు 5 కోట్లకు పైగా కలెక్ట్ రికార్డులు తిరగరాసింది. అయితే ఇప్పుడు అదుర్స్‌కు కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. మొదట్లో ఆసక్తి చూపించిన ఆడియెన్స్ ఓ స్టేజ్ దాటిన తర్వాత పాత చిత్రాలను చూడ్డానికి ఆసక్తి చూపించడం లేదు. చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్‌కు కూడా ఇదే పరిస్థితి. దానికి ముందు ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ చిత్రాల రీరిలీజ్‌కు ఇదే కండిషన్ ఎదురైంది.
ఇక అదుర్స్ మూవీ ఫలితంతో రానున్న రోజుల్లో అగ్ర హీరోల చిత్రాలను రీరిలీజ్ చేయాలనుకున్న ప్రొడ్యూసర్లు కూడా వెనక్కి తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ మూవీనే పట్టించుకొకపోతే మన చిత్రాలను ఎవరు చూస్తారని కొందరు హీరోలు కూడా ఫీలవుతున్నట్టు సినీ వర్గాలలో టాక్. ఈ మూవీ రీరిలీజ్ వల్ల పాత సినిమాలను మళ్ళీ విడుదల చేయాలనుకున్నవారికి జ్ఞానోదయం అయిందని సమాచారం. ఈ మూవీ రిజల్ట్ తో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అన్ని సినిమాలను రీరిలీజ్ చేయడం సరైన డిసీషన్ కాదని అంటున్నారు.
Also Read: 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా…పెళ్లి గురించి ఆలోచించని 6 మంది హీరోయిన్లు వీరే.! ఒకొక్కరిది ఒకో కారణం.!