Ads
శివుడు భక్త సులభుడు. కోరిన వరాలను ఇచ్చే భోళాశంకరుడు అన్నారు. ఆడంబరాలకు దూరంగా ఉండే శివుడు. చెంబుడు నీటితో అభిషేకం చేసి, మారేడు ఆకులతో పూజ చేస్తే చాలు పరవశించి పోతాడు. బ్రహ్మదేవుని లలాటం నుండి పుట్టిన శివుడు లయ కారకుడు.
Ads
మహాలింగోద్భవం అయిన రోజూనే మహా శివరాత్రిగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది వచ్చే మాఘ బహుళ చతుర్థుతిన ఈ పండుగ జరుపుకోవడం సంప్రదాయం. ఈ రాత్రి శివుని కోసమే అందువల్లనే మహా శివరాత్రి అంటారు. ఆ పరమ శివుని లీలల పై చాలా మంది దర్శకులు చాలా సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు అగ్ర హీరోలు శివుని వేషం వేసి, అలరించారు. అలా తెలుగు సినిమాలలో శివుడిగా నటించి, మెప్పించిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1.ఎన్టీఆర్ ‘దక్షయజ్ఞం’,‘ ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ సినిమాల్లో శివుడి వేషంలో మెప్పించారు.
2.అక్కినేని నాగేశ్వరరావు శివుడిగా పౌరాణిక చిత్రంలో నటించకపోయిన మూగ మనసులు చిత్రంలో ‘గౌరమ్మ నీ మొగుడెవరమ్మ’ అనే పాటలో వచ్చే సన్నివేశాల్లో శివుడిగా కనిపించారు.3.శోభన్ బాబు ‘పరమానందయ్య శిష్యుల కథ’ చిత్రంలో శివుడి పాత్రలో మెప్పించారు.4.రెబల్ స్టార్ కృష్ణంరాజు వినాయక విజయం చిత్రంలో శివుడి పాత్రలో మెప్పించారు.5.సీనియర్ నటుడు బాలయ్య చాలా చిత్రాల్లో శివుడిగా నటించారు.
6. సీనియర్ హీరో రామకృష్ణ ‘మాయా మశ్చీంద్ర’ మూవీలో పరమ శివుడి పాత్రలో మెప్పించారు.
7. కృష్ణ హీరోగా వచ్చిన ‘ఏకలవ్య’ సినిమాలో రంగనాథ్ పరమ శివుడి పాత్రలో మెప్పించారు.
8. మెగాస్టార్ చిరంజీవి ‘శ్రీ మంజునాథ’ సినిమాలో శివుడి వేషంలో మెప్పించారు.
9. నందమూరి నటసింహం బాలకృష్ణ ‘సీతా రామకళ్యాణం’ చిత్రంలో ఒక పాటలో శివుడిగా కనిపించారు.
10. అక్కినేని నాగార్జున ‘జగద్గురు ఆది శంకర’ సినిమాలో శివుడి పాత్రలో, చండాలుడు పాత్రలో కనిపించారు.
11. సుమన్ ‘ శ్రీ సత్యనారాయణ మహత్యం’ చిత్రంలో సత్యనారాయణ స్వామిగా, శివుడిగా, బ్రహ్మాగా నటించారు.
12. నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ భూషణం భూకైలాస్, ఉమా సుందరి, నాగుల చవితి చిత్రాల్లో శివుడుగా మెప్పించారు.
13. ఒకప్పుడు విలన్‌గా నటించిన రాజనాల రెండు చిత్రాల్లో శివుడిగా మెప్పించారు.
14. ఒకప్పుడు విలన్‌గా నటించిన రావు గోపాల్ రావు ‘మావూళ్లో మహాశివుడు’ మూవీలో శివుడుగా మెప్పించారు.
15. ప్రకాష్ రాజ్ ‘ఢమరుకం’ మూవీలో శివుడి పాత్రలో మెప్పించారు.
Also Read: అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ మెడలో ధరించిన లాకెట్ గురించి తెలుసా?