వెంకటేష్ ”నువ్వు నాకు న‌చ్చావ్” మూవీని ఎన్నోసార్లు చూసినా ఈ మిస్టేక్ ని గ‌మ‌నించ‌లేదు..!

Ads

విక్టరీ వెంకేట‌ష్ హీరోగా నటించిన సూప‌ర్ హిట్ సినిమా నువ్వు నాకు న‌చ్చావ్. ఈ మూవీని చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెంకటేష్ నటనకి చాలా కనెక్ట్ అయిపోయారు. అలాగే త్రివిక్రమ్ మాటలకి కూడా అంతే కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ వచ్చి ఇరవై ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆడియెన్స్ మెప్పిస్తూనే ఉంది.

నువ్వు నాకు నచ్చావ్ సినిమా 2001లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ నటించింది. ఇప్పుడు ఈ చిత్రం టీవీలో వచ్చినా టీవీకి అతుక్కుపోయే ఆడియెన్స్ ఉన్నారంటే, ఈ మూవీ ఆడియెన్స్ ఎంతగా  కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమాలలో కొన్ని చిన్న చిన్న పొర‌పాట్లు జ‌ర‌గ‌డం అనేది చాలా స‌హ‌జం. అయితే వాటిని ఎక్కువ మంది గుర్తించ‌లేరు. ఇరవై ఏళ్లు క్రితం వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ మూవీని ఎన్నో సార్లు చూసే ఉంటారు. కానీ ఈ సినిమాలో ఉన్న పొర‌పాటును ఇప్ప‌టి దాకా ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదని చెప్పవచ్చు.

Ads

ఈ చిత్రంలో వెంకీ వాళ్ళ నాన్న మిత్రుడి ఇంటికి వెళతాడు. ఇక అక్కడే ఉంటున్న వెంకీకి వాళ్ళ నాన్న ఉత్త‌రం రాస్తాడు. అప్పుడు హీరోయిన్ ఆర్తి అగర్వాల్, ఆమె చెల్లెలు పింకీ వెంకీ ద‌గ్గ‌ర‌కు వెళ్ళడం జరుగుతుంది. ఆ సన్నివేశంలో నా పేరు పింకీ,లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ లో 9వ తరగతి చదువుతున్నట్టుగా చెప్తుంది.
మరో సన్నివేశంలో పింకీ స్కూల్‌కి వెళ్తున్నప్పుడు బస్ స్టాప్ లో కొంత మంది ఆమెను ఏడిపిస్తారు. అప్పుడు హీరో వెంకీ వ‌చ్చి పింకీకి ధైర్యం చెప్పడంతో పాటుగా వాళ్లని కొట్టమని చెప్పడంతో పింకీ ఒకరిని కొట్టి, స్కూల్ బస్ రాగానే ఎక్కి వెళ్లిపోతుంది. అయితే ఆ పింకీ ఎక్కిన స్కూల్ బస్ మీద B.V.B.P SCHOOL అని రాసి ఉంటుంది.
అయితే ముందు సన్నివేశంలో పింకీ చెప్పిన స్కూల్ పేరుకి, స్కూల్ బస్ మీద పేరు మ్యాచ్ కాలేదు. పోనీ షార్ట్ కట్ లో రాసినా కూడా బస్ పై ఉన్న అక్షరాలు పింకీ చెప్పిన పేరుకి మ్యాచ్ అయ్యేలా లేవు. ఇక ఇలాంటి పొరపాట్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఆ పొరపాట్లలో ఇది కూడా ఒకటి. అయితే చాలా చిత్రాలల్లో ఇలాంటి ఈ పొరపాట్లను గ‌మ‌నిస్తూంటారు. అయితే మూవీ నచ్చినపుడు ఎక్కువగా ప‌ట్టించుకోరు.

Also Read: పెళ్లికి ముందే పిల్లలకు జన్మనిచ్చిన సెల‌బ్రెటీలు వీరే..!

Previous articleఉదయ్ కిరణ్ తో నటించిన ఈ 4 నటులు కూడా చనిపోయారు..!
Next article“నువ్వు బిచ్చగాడివా..?” అనేవాళ్ళు..! అంబానీ అలా చేయడంతో స్కూల్లో కొడుకుని..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.