ఇందుకేగా మిమ్మల్ని తిట్టేది… ఇండియా గెలుపుని ఓర్వలేక ఈ పాక్ ప్లేయర్ ఏమన్నాడు అంటే.?

Ads

ఐసీసీ ప్రపంచకప్‌ 2023 టోర్నీ భారత్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక మెగాటోర్నీలో  టీమిండియా అపజయం ఎరుగని జట్టుగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ దక్షిణాఫ్రికా పై విజయం సాధించి, సెమీస్ కు చేరుకుంది.

అయితే పాక్ మాజీ క్రికెటర్ హసన్ రజా భారత జట్టు తాము కోరుకున్నట్టుగా డీఆర్‌ఎస్‌ను వినియోగిస్తోందని వివాదాస్పద కామెంట్స్  చేశాడు. సౌత్ఆఫ్రికా పై భారత్ గెలిచిన తరువాత హసన్ రజా ఈ వాఖ్యలు చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళుతోంది. వరుసగా 7 విజయాలను సాధించిన టీమిండియా ఆదివారం (నవంబర్‌ 5) కోల్‌కతాలో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సౌత్ఆఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 243 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. 327 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన సౌత్ఆఫ్రికా భారత బౌలర్లు ధాటికి 27.1 ఓవర్లు ఆడి 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు, షమి, కుల్‌దీప్‌ చెరో రెండు వికెట్లు తీయగా, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.
మహ్మద్ షమీ బౌలింగ్‌లో సౌత్ఆఫ్రికా ప్లేయర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ఎల్బీకి దొరికాడు. కానీ, టీమిండియా రిక్వెస్ట్ ని ఫీల్డ్ అంపైర్ రిజెక్ట్ చేశాడు. అనంతరం టీమిండియా రివ్యూ తీసుకుంది. ఆ సమీక్షలో బాల్ మిడ్ పిచ్, లెగ్-స్టంప్‌ను తాకినట్లు కనిపించింది. దాంతో థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. అలా డస్సెన్ 32 బాల్స్ లో 13 రన్స్ కే వెనుదిరిగాడు. అయితే, డీఆర్‌ఎస్ తో ఫామ్‌లో ఉన్న రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌ను మహ్మద్ షమీ ఔట్ చేయడం సందేహాస్పదంగా ఉందని పాక్ మాజీ క్రికెటర్ హసన్ రజా వివాస్పద కామెంట్స్ చేశాడు.

Ads

“ DRS టెక్నాలజీ గురించి మాట్లాడుతూ, డస్సెన్ కాలికి తగిలిన బాల్, లెగ్ స్టంప్ పై నుండి వచ్చి మిడిల్ స్టంప్‌ను టచ్ చేసింది. అది ఎలా పాజిబుల్ ? బాల్ లెగ్ స్టంప్ వైపునకు వెళ్లాలి. అందరిలాగే తన  అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇటువంటివి చెక్ చేసుకోవాలి. టీమిండియా తన అవసరాలకు తగ్గట్టుగా డీఆర్‌ఎస్‌ను మారుస్తోంది. ఇది క్లియర్ గా కనిపిస్తుంది” అని రజా కామెంట్స్ చేశాడు. నెటిజెన్లు రజా కామెంట్స్ కు కౌంటర్ గా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: వైరల్ అవుతున్న “మ్యాక్స్‌వెల్” భార్య పోస్ట్… భర్త డబల్ సెంచరీపై ఏమని స్టోరీ పెట్టారంటే.?

Previous articleరాహుల్‌, స్టాలిన్, జయలలితలతో పోటీ చేసి…ఇప్పుడు కేసీఆర్ తో కూడా పోటీ చేస్తున్న ఈ ఎలక్షన్ కింగ్ ఎవరో తెలుసా.?
Next articleఈ 6 మంది యంగ్ ఇండియన్ క్రికెటర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా.? ఫోటోలు ఓ లుక్ వేయండి.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.