MARRIAGE SONG: 12 గుంజల పాట విన్నారా.? ఇకనుంచి పెళ్లిళ్లలో ఈ పాటే వినిపిస్తుంది..!

Ads

ఈమధ్య తెలంగాణ నేటివిటీ సాంగ్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి. తెలంగాణ భాష యాస తెలంగాణ సింగర్లు పాటకి అందాన్ని తీసుకువచ్చి సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు. తాజాగా షరతులు వర్తిస్తాయి అనే సినిమా నుండి 12 గుంజాల పందిరి అనే పెళ్లి సాంగ్ విడుదలైంది.

ఈ సినిమాలో చైతన్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించారు. కుమార‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టగా తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగును ప్రముఖ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేశారు.

Ads

సినిమాలో హీరోయిన్ హీరోని గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అని అడగగా వచ్చే సందర్భంలో ఈ పాట వస్తుందని తెలిపారు. తెలంగాణ పల్లెల్లో పాడే పాటల్లాగా దీన్ని రాశారు. మొదట పెళ్లి గురించి రాసి చివర్లో ఆడపిల్ల గురించి ఎమోషనల్ లిరిక్స్ రాశారు. ప్రస్తుతం ఈ పెళ్లి పాట బాగా వైరల్ అవుతుంది. ఇక నుంచి తెలంగాణ పెళ్ళిళ్ళల్లో ఈ పాట కచ్చితంగా వినిపిస్తుంది అని సినిమా టీం ఆశ భావం వ్యక్తం చేసింది.

ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ…. ఈ పాట వినగానే ఫిదా సినిమాలో వచ్చిండే పాట విన్న ఫీలింగ్ కలిగిందని… అదే రేంజ్ లో ఈ పాట కూడా హిట్ అవుతుందని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పాటకి పెద్దింటి అశోక్ కుమార్ లిరిక్స్ రాయిగా సురేష్ బొబ్బిలి సంగీత అందించారు. తెలంగాణ నేటివిటీ సింగర్స్ మొగుళ్ల శంకరమ్మ, శంకర్ బాబు, తేలు విజయ, వొల్లల వాణిలతో ఈ పాట పాడించారు.

Previous articleటీ, టోస్ట్ కి అంత రేటా.? వైరల్ అవుతున్న అయోధ్యలోని రెస్టారెంట్ బిల్.!
Next articleజీవితంలో సక్సెస్ సాధించాలంటే.. ఇలాంటి వారికి ఎల్లపుడూ దూరంగా ఉండాలి..
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.