Ads
మనం ఎంత పెద్ద అయిపోయినా సరే చిన్నప్పుడు మనం చేసే పనులు మనకి గుర్తు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఆటలాడడం మొదలు తీసుకునే ఆహారం వరకు చాలా విషయాలని మనం మర్చిపోలేము. మనకి గుర్తుంటూ ఉంటాయి. పార్లె జీ బిస్కెట్లని కూడా మనం చిన్నప్పుడు ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళం. ఉదయం లేవగానే పాలల్లో బిస్కెట్లను ముంచుకుని చాలా మంది తింటూ వుంటారు. మీరూ తినేవారా..? అయితే పార్లె జీ బిస్కెట్లకి ఆదరణ మాత్రం ఎప్పుడు తగ్గలేదు. ఇప్పటికి కూడా పార్లె జీ బిస్కెట్లని అందరూ తింటున్నారు. నిజానికి ఈ బిస్కెట్లు ఎందుకు ఫేమస్ అయ్యాయి..?
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. దీని వెనకాల పెద్ద చరిత్రే వుంది. ఆ చరిత్ర ఏమిటి అనేది మీరు తప్పక చూడాలి. 1929 లో బ్రిటిష్ వారు మనల్ని పాలిస్తున్నారు. అప్పుడు స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలి అని ఉద్యమం జరిగింది. ఆ సమయంలో మనకి కూడా బిస్కెట్లు ఉండాలని అనుకున్నారు. ముంబై కి చెందిన సిల్క్ వ్యాపారి మోహన్ లాల్ దయాల్ ఓ యంత్రాన్ని తెచ్చారు. 1929లో ముంబై లోని ఇర్లా అండ్ పార్లా అనే వద్ద ఫ్యాక్టరీని స్టార్ట్ చేసారు. వారి కుటుంబ సభ్యులే అక్కడ పని చేసేవారు. ఆరెంజ్ క్యాండీ, టాఫీలను మొదట మొదలు పెట్టగా.. తరవాత పదేళ్లకు బిస్కెట్స్ ని తెచ్చారు. ఆ ప్రాంతం పేరు మీదనే ఈ బిస్కెట్స్ ని తీసుకు వచ్చారు.
Ads
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతునప్పుడు 1939 లో పార్లె గ్లూకో బిస్కెట్స్ ని తీసుకొచ్చారు. ఆనాడు మార్కెట్ లో ఉండేవి అన్నీ కూడా బ్రిటీష్ వారివే. కేవలం పార్లె ఒక్కటే మన దేశంపై చెందినవి. మనకి స్వాతంత్య్రం వచ్చాక భారత్, పాకిస్థాన్ విడిపోయాక గోధుమలు తగ్గాయి. దానితో పార్లె బిస్కెట్లుని కూడా చేయలేదు. తరవాత 1960లలో బ్రిటానియా గ్లూకోస్ డి అనే పేరు పెట్టి పార్లె గ్గూకో బిస్కెట్లను తీసుకు వచ్చింది. జనం దాన్ని కనుక్కోలేకపోయారు. తరవాత పార్లె లోగోను రెడ్ కలర్ లోకి మార్చేసింది. ఎల్లో కలర్ లో ప్యాకెట్ ని మార్చింది. దీనితో మళ్ళీ స్వచ్ఛమైన స్వదేశీ బిస్కెట్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి.