Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు. ఈ సీజన్ పవర్ స్టార్ ఎపిసోడ్ తో ముగిసింది.
Ads
పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ను రెండు భాగాలుగా రిలీజ్ చేశారు.పవన్ కళ్యాణ్ మొదటి భాగంలో తన వ్యక్తిగతమైన ఎన్నో విషయాలను వెల్లడించారు. రెండవ భాగంలో పవన్ రాజకీయ జీవితానికి చెందిన విషయాలను చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆయన లైఫ్ లో జరిగిన కొన్ని ప్రధానమైన మరియు ఇంట్రెస్టింగ్ విషయాలను పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ కి ఉన్నటువంటి ఒక వ్యాధిని బయట పెట్టారు.
ఆయన 6, 7 చదువుతున్న సమయంలో ఆస్త్మా జ్వరం లాంటిది ఉండేదంట. దానితో పవన్ కళ్యాణ్ చాలా బాధపడేవారంట. తనకి ఈ వ్యాధి ఉన్నందువల్ల ఆయన స్నేహితులు ఆ సమయంలో తనతో ఉండేవారు కాదంట. దాంతో ఆయన ఒంటరిగా ఉంటూ బుక్స్ ని చదువుతూ ఉండేవారంట. అయితే తన మిత్రులందరు ఆటల్లో రాణిస్తూ ఉండేవారని, తను మాత్రం ఆడిన ప్రతిసారి ఆటలో ఒడిపోతూ ఉండేవారని తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి స్కూల్ కి వెళ్లడం ఇష్టం ఉండేది కాదంట. పవన్ కళ్యాణ్ కి టీచర్లు అంటే కూడా ఇష్టం ఉండేది కాదంట.
ఆయన ఏ విషయం గురించి అయిన సొంతంగానే నేర్చుకునేవాడట. ఈ క్రమంలోనే 17 ఏళ్ళ వయసులో మానసికంగా ఒత్తిడికి గురైన పవన్ కళ్యాణ్ చనిపోవడానికి కూడా ప్రయత్నించాడంట. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తన అన్న చిరంజీవి దగ్గర ఉండే గన్ తీసుకొని పవన్ కళ్యాణ్ కాల్చుకోవడానికి చూశాడంట. అయితే సరిగ్గా ఆ సమయంలో ఆయన చేతిలో గన్ చూసిన సురేఖ, నాగబాబులు పవన్ ని తిట్టి, గన్ ని లాక్కున్నారంట. తరువాత ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పడంతో పవన్ ని తిట్టి, నువ్వు చదవకపోయినా పరవాలేదు. కానీ నువ్వు బ్రతికుంటే చాలని చిరంజీవి పవన్ కి చెప్పారని వెల్లడించారు.
Also Read: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 15 రీమేక్ సినిమాల లిస్ట్..