Ads
‘సాహో’ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఓజి’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతుందనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా ‘ఓజి'(ఒరిజినల్ గ్యాంగ్ స్టార్) సినిమా పూజ కార్యక్రమం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
Ads
ఈ మూవీ లాంచ్ కి సినీ ఇండస్ట్రీ నుండి చాలా మంది పెద్దలు వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డీవీవీ దానయ్య, సుజీత్ లతో పాటు అల్లు అరవింద్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, దిల్ రాజు లాంటి వారు కూడా ఈ పూజ కార్యక్రమానికి హాజరయ్యి, చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.ఆర్ఆర్ఆర్ వంటి సినిమా తరువాత ప్రొడ్యూసర్ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తుండడం, భారీ బడ్జెట్ సినిమా అవడంతో ఈ మూవీ పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి స్టైలిష్ లుక్ లో హాజరు అయ్యారు. చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ స్టైల్ గా కనిపించారు. ఎందుకంటే ఆయన చాలా కాలం నుండి రాజకీయాల్లో బిజీగా ఉంటూ, ఎక్కువగా వైట్ అండ్ వైట్లోనే కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీ ఓపెనింగ్ లో పవన్ లుక్ తో అదిరిపోయేలా ఉందని చెప్పవచ్చు.
అంతే కాకుండా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ లుక్ తో పాటుగా ఆయన ధరించిన వాచ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆయన పెట్టుకున్న వాచ్ ‘పనేరాయ్’ అనే పాపులర్ బ్రాండ్ కి చెందిన వాచ్. ఇక దీని ఖరీదు రూ.13.52 లక్షలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నెటిజెన్లు, అభిమానులు ఈ వాచ్ బ్రాండ్ తెలుసుకోవడం కోసం ఆన్లైన్ లో వెతికి, వాచ్ ఖరీదును చూసి షాకైనట్టు సమాచారం. అయితే తను నటించే ఒక్కో మూవీకి 50-60 కోట్ల వరకు రెమ్యునేషన్ అందుకునే పవర్ స్టార్ అలాంటి వాచ్ పెట్టుకోవడం పెద్దగా విశేషం కాదనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న హీరోలలో చాలా మంది 25 లక్షల కన్నా ఎక్కువ ఉండే వాచ్ లను ధరిస్తున్నారు.
Also Read: ‘పుష్ప’ సినిమాలో సుకుమార్ చేసిన ఈ మిస్టేక్ ను గమనించారా?