Ads
తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రను దేశ దేశాలు గుర్తించే విధంగా సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో తాన్ ఇండియా రేంజ్ కథ ఒకటి తయారు చేయడంలో ఆయన బిజీగా ఉన్నారు.
రాజమౌళి కథల వెనుక.. ఉన్న పదునైన చేయి ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్. గతంలో బొబ్బిలి పులి, సమరసింహారెడ్డి ,సింహాద్రి ,సై ,చత్రపతి,మగధీర లాంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన కథలు అందించిన నేటి రైటర్ ఆయన. రాజమౌళి చేసిన అన్ని సినిమాలకు కథలు అందించింది విజయేంద్రప్రసాద్ అన్న విషయం అందరికీ తెలుసు.
ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ ఒక మంచి పొలిటికల్ డ్రామాకు సంబంధించి ఓ స్టోరీని రాస్తున్నట్లు టాక్. అయితే ఆ స్టోరీ కి హీరోగా పవన్ కళ్యాణ్ సెట్ అవుతాడు భావించిన ఆయన ఇదే విషయాన్ని చాలా మంది ప్రొడ్యూసర్లకి కూడా తెలియజేశారు. ఇప్పటికే స్టోరీ పూర్తిగా రెడీ చేసుకుని పవన్ కళ్యాణ్ కోసం సిద్ధంగా ఉంచి పెట్టినట్లు తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ తో .. ఈ కథ పవన్ కళ్యాణ్ కే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని చాలామంది ప్రొడ్యూసర్లు కూడా చెప్పడంతో పవన్ కు ఈ స్టోరీ చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Ads
ప్రస్తుతం ఎలక్షన్స్ లో బాగా బిజీగా ఉన్న పవన్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత కథ వింటాను అని విజయేంద్ర ప్రసాద్ కు చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. విక్రమార్కుడు అనే సినిమా నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్లో రావాల్సిందే పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ఆ మూవీ మిస్సైంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తో చేసే మూవీ మిస్ చేసుకునే ఉద్దేశం విజయేంద్రప్రసాద్ లో కనిపించడం లేదు. మరోపక్క ఈ సినిమాలో పవన్ సీఎంగా కనిపించబోతున్నట్లు టాక్. అయితే ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.
విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ చేసే స్టేజీలో లేడు అన్న విషయం తెలిసిందే.. ఇక రాజమౌళి ఒక సినిమాలో లాక్ అయితే బయటపడడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి కాబట్టి కుదిరే ప్రసక్తి లేదు. ఇక ఈ మూవీ కోసం ఎవరైనా యంగ్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసే ఆ డైరెక్టర్ ఎవరు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.