Ads
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో తరగతి చదువుతున్న విద్యార్థికి రాసిన లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లెటర్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ లెటర్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
బెంగళూరు నగరానికి చెందిన ఆరుష్ శ్రీవత్స అనే బాలుడు రెండవ క్లాస్ చదువుతున్నాడు. గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి అయిన హీరాబెన్ కన్నుమూసిన వార్తను టీవీలో చూసిన ఆరుష్ శ్రీవత్స చాలా బాధపడ్డాడు. ఆ తరువాత ఆ బాలుడు ప్రధాని నరేంద్ర మోదీకి లెటర్ రాశాడు. ఆ లెటర్ లో ప్రధాని మోదీ తల్లిగారి మృతి గురించి సంతాపం తెలిపాడు. అంతే కాకుండా హీరాబెన్ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నానని తెలిపాడు.ప్రధాని నరేంద్ర మోదీ ఆరుష్ శ్రీవత్సకి ధన్యవాదాలు తెలుపుతూ జనవరి 25న లెటర్ రాశారు. మాతృమూర్తిని కోల్పోవడం అనేది పూడ్చలేని లోటని, ఆ బాధను మాటల్లో చెప్పలేము అని తెలిపారు. ఈ కష్ట కాలంలో తనకు మద్దతుగా ఉన్నందుకు ఆ బాలుడికి మోదీ ధన్యవాదాలు చెప్పారు. ఇలాంటి అభిమానం, ఆప్యాయతే తల్లి లేని బాధను తట్టుకునే శక్తిని ఇస్తోందని తెలిపారు.
Ads
బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్ ఆ బాలుడు రాసిన లెటర్ ను, అలాగే మోదీ రాసిన ప్రత్యుత్తరాన్ని కూడా సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ప్రధాని మోదీ రెండవ తరగతి విద్యార్థి రాసిన లెటర్ కు కూడా సమాధానం ఇచ్చారు. ఇదే నాయకత్వ లక్షణం. ఇటు వంటి చిన్న చిన్న పనుల వల్ల పిల్లలు సరైన మార్గాల్లో పయనిస్తారని అన్నారు. ప్రధాని లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ప్రధాని మోదీ వినయశీలి, మానవతావాది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: సీనియర్ ఎన్టీఆర్, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మధ్య చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి తెలుసా?
This is the quality of a true Statesman! Hon’ble PM @narendramodi ji responds to the condolence letter of a class 2 student. These are life changing gestures that will steer the life of this young one in the right direction. pic.twitter.com/97P9fIrQLP
— KhushbuSundar (@khushsundar) February 15, 2023