Ads
తమిళ నటుడు ప్రభు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు.తెలుగులో అనేక సినిమాల్లో హీరోలకు తండ్రిగా నటించారు. ఈయన ముఖ్యంగా డార్లింగ్, చంద్రముఖి, తూనీగా తూనీగా, మిస్టర్ ప్రేమికుడు, నేనే వస్తున్నా, రంగా రంగా వైభవంగా వంటి సినిమాల్లో తండ్రి పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు .ఈయనకు ఇద్దరు పిల్లలు… ఓ కుమారుడు…ఓ కూతురు ఉన్నారు.ఆమె వయసు 34 సంవత్సరాలు కాగా తాజాగ కూతురను ఓ స్టార్ డెరైక్టర్ కు ఇచ్చి రెండో పెళ్లి చేశారు. అయితే కట్న కానుకలు కూడా బాగానే ఇచ్చారట.
యాక్టర్ ప్రభు కుమారుడు కూడా ఓ హీరోనే. అలాగే కూతురు పేరు ఐశ్వర్యా ప్రభు. ఐశ్వర్యా ప్రభుకు గతంలోనే ఓసారి వివాహం జరిగింది. తమ దగ్గరి బంధువు అయిన కునాల్ అనే వ్యక్తికి ఇచ్చిన 2009లో ఘనంగా పెళ్లి చేశారు.భార్యాభర్తల ఇద్దరి మధ్య వచ్చిన గొడవల కారణంగా అతడితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉంటూ సొంతంగా బిజినెస్ చేస్తోంది.
Ads
విక్రమ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ఇరుకప్పపుట్టు.ఈ సినిమా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో ఐశ్వర్యకు స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. స్టార్ డైరెక్టర్ అయిన అధిక్ రవిచంద్రన్ నటుడుగా కూడా చాలా సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం ఈయన వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. అయితే ఐశ్వర్యా ప్రభు కంటే రెండేళ్ల చిన్న వాడు.ఐశ్వర్యను తొలి చూపులోనే ఇష్టపడ్డాడు. ఆమెకు కూడా నచ్చడంతో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించారు. ఇక పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించారు. డిసెంబర్ 15వ తేదీన చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.అయితే ఈ పెళ్లికి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. హీరో విశాల్, సుహాసిని, రాధిక.. ఇలా చాలా మంది పెద్ద పెద్ద సెలిబ్రిటీలు వచ్చి సందడి చేశారు.