ఆ ఒక్క సీన్ బాగోలేదని…బాలయ్య సమరసింహా రెడ్డి సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.?

Ads

టాలీవుడ్ నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. అంతేకాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. కాగా ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుండడంతో దర్శకనిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య బాబుకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

Ads

అదేమిటంటే.. బాలయ్య బాబు హీరోగా నటించిన చిత్రం సమరసింహారెడ్డి. 1999 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు రికార్డులను బద్దలు కొట్టింది. అప్పట్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇక ఈ సినిమా విడుదలై జనవరి 13కు 23 ఏళ్లు పూర్తి అవుతుంది. అయితే ఈ చిత్రానికి ముందుగా సమరసింహం అనే టైటిల్ ని అనుకున్నారట. కానీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సలహా మేరకు ఈ సినిమాకు సమరసింహారెడ్డి అనే టైటిల్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

బాలయ్య సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించడం ఇదే మొదటిసారి. అయితే ఈ సినిమాను ఒక హీరోయిన్ సినిమాలో ఒక సన్నివేశం బాగోలేదని రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు రాశి. చిత్రంలో సీతాకోకచిలక సీన్ రాశి ఒప్పుకోలేదట. దాంతో ఆమె ప్లేస్లో హీరోయిన్ గా సిమ్రాన్ ను తీసుకున్నారు. ఇక సంక్రాంతికి విడుదల చేసిన ఈ సినిమాకు ఆరు కోట్ల బడ్జెట్ ను కేటాయించగా 16 కోట్ల కలెక్షన్ వచ్చాయి. అలా బాలయ్య బాబు కెరీర్ లోనే చెప్పుకోదగ్గ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది.

Previous articleAYODHYA: ఆహ్వానం అందినా కూడా ఎన్టీఆర్, ప్రభాస్ లు అయోధ్యకు ఎందుకు వెళ్ళలేదు.?
Next articleఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ కు బ్రహ్మముడి సీరియల్ కావ్య చెప్పిన చిట్కా..! ఏంటంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.