Ads
ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. టీమిండియా టోర్నీ ఆరంభం నుండి ఒక్క మ్యాచ్ కూడా కోల్పోకుండా ఆడిన తొమ్మిది మ్యాచుల్లో అన్ని గెలిచింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై 70 పరుగుల తేడాతో గెలిచి, ఫైనల్ కు చేరుకుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగుగనుంది.
భారత జట్టు వరుస విజయాల వెనుక జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర ఉందనే విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో ద్రవిడ్ అందరికీ ఎదురెళ్ళి, విమర్శలను సైతం ఎదుర్కొన్నాడు. ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
2023 మొదట్లోనే భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లు గాయాల పాలైన విషయం తెలిసిందే. ఇక కేఎల్ రాహుల్ గత ఏడాది నుండి పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో గాయపడి రాహుల్ క్రికెట్ కు దూరమయ్యాడు. మరో వైపు శ్రేయస్ అయ్యర్ వెన్నుకి గాయం అయిన కారణంగా మార్చి నుంచి ఆటకు దూరమయ్యాడు. ఈ ఇద్దరు ప్లేయర్లు ఆసియా కప్ సమయానికి గాయం నుండి కోలుకోవడంతో మళ్ళీ టీమ్ లోకి తీసుకున్నారు.
ఆ తరువాత ప్రపంచకప్ లో ఆడే భారత జట్టుకి రాహుల్, శ్రేయస్ లను సెలెక్ట్ చేశారు. అయితే వారిని జట్టులోకి తీసుకున్నందుకు చాలా మంది ఫ్యాన్స్ మరియు మాజీ క్రికెటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సెలెక్షన్ పై సందేహాలు వ్యక్తం చేశారు. రాహుల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడని, శ్రేయస్ ఫిట్ నెస్ తో లేడని చాలామంది కామెంట్స్ చేశారు. అలాంటివారిని వరల్డ్ కప్ లో ఆడేందుకు ఎలా తీసుకుంటారని అటు కోచ్ ద్రవిడ్ ను, ఇటు బీసీసీఐ సెలెక్షన్ కమిటీని కూడా తిట్టిపోశారు.
రాహుల్ ప్లేస్ లో సంజూ సామ్సన్, శ్రేయస్ ప్లేస్ లో తిలక్ వర్మను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలని కూడా సూచించారు. రాహుల్ ద్రవిడ్ మాత్రం కామెంట్స్ ను పట్టించుకోకుండా రాహుల్, శ్రేయస్ లను ఎంపిక చేసి, వారి పై నమ్మకం ఉంచాడు. వారిలో కాన్ఫిడెన్స్ ని నింపాడు. వీరిద్దరు ప్రపంచకప్ లో సూపర్ గా ఆడుతున్నారు. మిడిలార్డర్ లో బాగా ఆడుతూ జట్టు గెలుపులో కీలకంగా మారారు.
Ads
Also Read: శుభమన్ గిల్ ని రిటైర్డ్ హర్ట్ అవ్వమని.. అశ్విన్ తో రోహిత్ పంపిన మెసేజ్ వెనక ఇంత ప్లాన్ ఉందా..?