దర్శకధీరుడు రాజమౌళి నటించిన సినిమా ఏమిటో తెలుసా?

Ads

దర్శక ధీరుడు రాజమౌళి గురించి తెలుగు సినిమా ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా చాటి చెప్పాడు. ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.

Ads

తాజాగా నాటు నాటు పాటకు గాను ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యింది. జక్కన్న ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఫ్లాప్ అనేది తెలియకుండా సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ లో దూసుకెళ్తున్నారు. తొలిసారిగా దర్శకత్వం చేసి స్టూడెంట్ నం.1 మూవీతో ఇండస్ట్రీలో రాణించాలనుకున్న కలను రాజమౌళి నిజం చేసుకున్నాడు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన స్టూడెంట్ నం.1 సినిమా నాలుగు కోట్ల బడ్జెట్ తో తీయగా, 12 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అయ్యింది.
రాజమౌళి స్టూడెంట్ నం.1 చిత్రం తరువాత రామ్ చరణ్ హీరోగా మగధీర, నేచురల్ స్టార్ నానితో ఈగ, ప్రభాస్ హీరోగా బాహుబలి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప విజువల్ వండర్స్ ని తనదైన శైలిలో క్రియేట్ చేసి, దర్శకధీరుడిగా తన టాలెంట్ ను దేశవ్యాప్తంగా చాటుకున్నాడు. భారతీయ చిత్రపరిశ్రమ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వ ప్రతిభను చూసి గర్వపడుతోంది.
ఇక ఇప్పటివరకు కూడా రాజమౌళి ఖాతాలో ఒక్క అపజయం కూడా లేదు. అలాంటి ఓటమి లేని రాజమౌళి నటించిన ఒక సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే, జక్కన్న తన సినిమాల్లో అప్పుడప్పుడు అథితి పాత్రలలో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఆయన తను దర్శకత్వం చేసే చిత్రంలోనే కాకుండా వేరే దర్శకుల చిత్రాల్లో కూడా అథితి పాత్రలలో కనిపిస్తూ ఉంటాడు.అలా డైరెక్టర్ రాజమౌళి, మరో దర్శకుడు కోడి రామకృష్ణతో కలిసి రెయిన్ బో అనే చిత్రంలో అతిథి పాత్రలలో నటించారు. ఈ మూవీకి వి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు విడుదల అయిందో కూడా చాలా మందికి తెలియదు. ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఇప్పటి వరకు రాజమౌళి విజయవంతమైన చిత్రాలు మాత్రమే చేయగా, ఆయన అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ చిత్రాల లిస్ట్ లో చేరింది. అలా రాజమౌళి తొలి సారిగా నటించిన ‘రెయిన్ బో’ ఫ్లాప్ మూవీగా నిలిచింది.

Also Read: లవ్ టూడే మూవీ హీరోయిన్ ఇవానా షాజీ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..

Previous articleస్మోకింగ్ అలవాటును మానేసి, అభిమానులకు ఆదర్శంగా నిలిచిన 10 మంది స్టార్ హీరోలు వీరే..
Next articleఅత్తా కోడలు ఎందుకు గొడవ పడతారు…? దాని వెనుక సైకలాజికల్ రీజన్ ఉందా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.