Ads
బుల్లితెర యాంకర్ సుమ చాలా సక్సెస్ఫుల్ షోలు చేస్తూ ఉంటుంది. ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే సుమ అడ్డా షోని ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా నడిపిస్తుంది.ఈ షోకి దాదాపు అన్ని సినిమా టీంలు ప్రమోషన్స్ కోసం వస్తూ ఉంటాయి. అలాగే సుమా కొడుకు రోషన్ హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమా టీం కూడా సుమా అడ్డా షో కి వచ్చింది. రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న బబుల్ గమ్ డిసెంబర్ 29 విడుదల కానుంది.
Ads
అయితే సుమ అడ్డా షోకి మూవీ టీమ్ అయిన హీరో రోషన్ కనకాల, హీరోయిన్ మానస చౌదరి, డైరెక్టర్ రవికాంత్, ఆర్టిస్ట్ కిరణ్ హాజరయ్యారు. వీరితోపాటు సుమా భర్త, రోషన్ తండ్రీ రాజీవ్ కనకాల కూడా వచ్చారు. ఈ షోలో సుమాకి భర్త రాజీవ్ కనకాల ప్రపోజ్ చేసి మాట్లాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. అయితే సుమ కొడుకు రోషన్ హీరోయిన్ తో కలిసి ఉప్పెనలోని జలజల జలపాతం సాంగ్ ని స్టేజి పైన పెర్ఫార్మ్ చేశారు. ఇది చూడలేక సుమ చీర మొహానికి అడ్డంగా పెట్టుకుంది.
అయినా వారు ఆపకపోవడంతో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇక ఆపండి అంటూ చెప్పింది. వెంటనే ఆర్టిస్ట్ కిరణ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇది షో అంటూ డైలాగ్ వేశాడు. వెంటనే అందరూ గట్టిగా నవ్వేశారు. ఇప్పుడు ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ ఈనెల 23న ఈటీవీలో ప్రసారం కానుంది.