Ads
త్వరలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. జనవరి 22 తారీఖున అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని రామ మందిర నిర్మాణ ట్రస్ట్ నిర్వహించ నుంది అయితే దేశ నలుమూలల నుండి కాశ్మీరు టు కన్యాకుమారి అతిథులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.అయితే సామాన్య భక్తులకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేదు. దీన్నే ఇప్పుడు హ్యకర్లు అదునుగా తీసుకుని రెచ్చిపోతున్నారు.
రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి విఐపి యాక్సెస్ లభిస్తుంది అంటూ ఫోన్లకు ఒక ఏపీకే ఫైల్ లింకును ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. తర్వాత మీ ఫోన్లో యాడ్ అవుతూ ఉంటాయి. సడన్ గా ఫోన్ స్లో అయిపోతుంది. దీంతో హ్యాకర్లకు మీ ఫోన్ లో యాక్సెస్ దొరికేస్తుంది.
మీ ఫోటోలో మీ కాంటాక్ట్ లిస్ట్ మీ పర్సనల్ డేటా అంత వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలియని చాలామంది ఆ వార్త నిజమేనేమో అంటూ ఆ లింక్ ని చాలా మందికి ఫార్వర్డ్ చేస్తున్నారు. భక్తి ముసుగులో చాలామంది చేసే ఈ కార్యక్రమాలు సామాన్యులకు తెలియడం లేదు. ఫోన్ వైరస్ బారిన పడకుండా హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఈ విషయంలో అవగాహన అనేది చాలా అవసరం. ఇది మన ఫ్రెండ్స్ తో మన కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
watch video :