Ads
అయోధ్యలో శ్రీరాముని మందిరం నిర్మాణం పూర్తయింది. జనవరి 22 తారీఖున అత్యంత వైభవంగా మందిర ప్రారంభోత్సవం శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు ప్రముఖులు పండితులు హాజరు కానున్నారు. కోట్లాదిమంది హిందువుల ఆకాంక్ష శ్రీరాముని మందిరం నిర్మాణం ఇప్పుడు పూర్తయింది.
అయితే రాముని మందిరం నిర్మాణం జరుగుతుందని తెలియగానే చాలామంది విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.ఇప్పటి వరకు రామాలయానికి దాదాపు 5000 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రాస్క్ ప్రకారం ఇప్పటివరకు రూ. 3200 కోట్లు ఆలయ అంకిత నిధి ఖాతాలోకి వచ్చాయి.దేశంలోని 11 కోట్ల మంది ప్రజల నుంచి రూ.900 కోట్లు సేకరించాలని రామమందిర్ ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం.
Ads
కానీ డిసెంబర్ వరకు రాముడి ఆలయానికి రూ.5 వేల కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి.శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం, రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటివరకు 18 కోట్ల మంది రామ భక్తులు నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బు జమ చేశారు.పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాల్లో దాదాపు రూ.3,200 కోట్ల సరెండర్ నిధులు జమ అయ్యాయి.
అయితే ఈ విరాలలో ఎక్కువ విరాళం ఇచ్చింది మాత్రం ఆధ్యాత్మిక గురువు మరియు కథకుడు మొరారీ బాపు అయోధ్యలో నిర్మించబడుతున్న గొప్ప రామ మందిరానికి ఇప్పటివరకు అత్యధిక విరాళం ఇచ్చారు. మొరారీ బాపు రామ మందిరానికి 11.3 కోట్ల రూపాయల విరాళం అందించారు. ఇవే కాకుండా ఇప్పటికీ విరాళాలు రావడం విశేషంగా చెప్పుకోవాలి.