Ads
- యాక్టర్స్: అభయ్ నవీన్, అనిల్ గీలా, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, అమూల్య రెడ్డి, జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్, తదితరులు
- ప్రొడక్షన్ సంస్థ: ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ
- రైటర్- డైరెక్టర్: అభయ్ నవీన్
- మ్యూజిక్:కమ్రాన్
- సినిమాటోగ్రఫీ: పహాద్ అబ్దుల్ మజీద్
- రిలీజ్ డేట్: సెప్టెంబర్ 15, 2023
చిన్న సినిమాగా రూపుదిద్దుకున్న రామన్న యూత్ సినిమా ఈరోజే విడుదల అయ్యింది. రాజకీయ పార్టీల వెనకే తిరిగే యువకుల జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బడ్జెట్ మూవీ అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథలోకి వెళ్తే..ఓ నలుగురు యువకుల కథే రామన్న యూత్ సినిమా.. ఈ యువకులు సిద్దిపేట జిల్లా ఆంక్షాపూర్ గ్రామానికి చెందిన వారుగా సినిమాలో చూపిస్తారు. ఈ గ్రామానికి చెందిన రాజు (అభయ్ నవీన్) కు ఎమ్మెల్యే రామన్న అంటే అమితమైన అభిమానం ఉంటుంది. ఆయనతో పాటే ఉంటూ రాజు కూడా లీడర్ గా ఎదగాలి అని ఆశపడతాడు.
అతని ఫ్రెండ్స్ చందు, రమేష్, బాలుతో కలిసి యువనాయకుడు అయిన అనిల్ తో తిరుగుతూ ఉంటారు. అంతటితో ఆగకుండా రామన్న యూత్ అసోసియేషన్ పెట్టి తనకు తానె లీడర్ అనుకుంటాడు. దసరా వస్తే.. పండగ సందర్భంగా రామన్నతో పాటు అనిల్ ని కూడా కలిపి ఫోటో వేయించి ఫ్లెక్సీ కట్టిస్తాడు. ఇందులో అనిల్ తమ్ముడు మహిపాల్ రాజు ఫోటో ఉండదు. దీనితో మహిపాల్ పగ పెంచుకుంటాడు. దీనితో వారిని అనిల్ తో కలవనివ్వకుండా గొడవలు పెడుతూ ఉంటాడు. వారిపై అనిల్ కు లేనిపోని అబద్ధాలు చెబుతాడు. ఒక స్టేజి లో ఆ లేబర్ గాళ్ళ వల్లే అన్న పేరు పోతోందని అంటాడు. దీనితో రాజు గ్యాంగ్ కు, మహిపాల్ కు మధ్య గొడవ పెద్దది అవుతుంది.
Ads
దీనితో మహిపాల్ తన అన్న సాయం లేకుండా ఎమ్మెల్యేని కలవాలి అంటూ ఛాలెంజ్ చేస్తాడు. రాజు ఆ ఛాలెంజ్ ని సీరియస్ గా తీసుకుని హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ ఏమి జరుగుతుంది? రాజు ఎందుకు జైలుపాలు అవుతాడు? అమూల్యతో అతని ప్రేమ సక్సెస్ అవుతుందా? రాజు లీడర్ అయ్యాడా లేదా? వారు ఎలాంటి పాఠం నేర్చుకున్నారు అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రాజకీయాల్లో నాయకుల వెంట తిరిగే యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.
దర్శకుడు, హీరో అయిన అభయ్ నవీన్ ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. అయితే తెరపై చూపించే విషయంలో కొంచం తడబడ్డాడని అనిపిస్తుంది. తెలంగాణ నేటివిటీలో సాగే ఈ సినిమా బాగానే అనిపిస్తుంది కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు. క్యారక్టరైజేషన్ చాలా బాగా అనిపిస్తుంది. కానీ, కథలో బలం లేకపోవడం ఒక మైనస్. దర్శకుడికి మొదటి సినిమా అయినప్పటికీ.. కొన్ని సన్నివేశాలు చాలా అనుభవంతో తీసాడని అనిపిస్తాయి. అక్కడక్కడా కనెక్ట్ అయినట్లు అనిపించకపోయినా.. ఓవరాల్ గా సినిమా నచ్చుతుంది